Alluri Sitarama Raju District in Children Death Cry: నాలుగు నెలల వ్యవధిలో 16 మంది శిశువులు మృత్యువాత పడటం అల్లూరి సీతారామరాజు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకే గ్రామంలో నలుగురు శిశువులు మరణిండంతో చిన్నారులు ఎందుకు మరణిస్తున్నారో అర్ధంకాక గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. కడుపు ఉబ్బరం, మూత్రం, మల విసర్జన వంటి సమస్యలతో చిన్నారులు అతలాకుతలం అవుతున్నారని ఆందోళన చెందుతున్నారు. గ్రామ వాలంటీర్లు, ఆశ కార్యకర్తలకు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చిన్నారుల మరణాలను అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
16 babies Died in Lakshmipet Panchayat: అల్లూరి జిల్లా పెదబయలు మండలం లక్ష్మీపేట పంచాయతీ పరిధిలో నాలుగు నెలల వ్యవధిలో సుమారు 16 మంది శిశువులు మృత్యువాత పడ్డారు. ఒకే గ్రామంలో నలుగురు చొప్పున శిశువులు మరణించారు. తమ గ్రామంలో అకారణంగా చిన్నారులు మరణిస్తున్నారని అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడుపు ఉబ్బరం, మూత్రం వంటి సమస్యలతో చిన్నారులు ఆసుపత్రి పాలవుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం కిటుమల, బల్లపు రాయి ప్రాంతాలలో 16 మంది శిశువులు మరణించారని, పూర్తిస్థాయి కారణాలు తెలుసుకొని, రక్షణ కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Heart operations in GGH: గుంటూరు ప్రభుత్వాసుత్రిలో మళ్లీ గుండె ఆపరేషన్లు: గోపాలకృష్ణ గోఖలే
Lakshmipet Villagers Comments: ''కారణం ఏమిటో మాకు తెలియడం లేదు. నాలుగు నెలలుగా చిన్నారుల మృత్యఘోష అగడం లేదు. పిల్లలు కల్గిన తల్లిదండ్రులు భయంతో బతుకుతున్నారు. చిన్నారుల ఆకస్మిక మరణాలు అంతుచిక్కడం లేదు. ఆరోగ్య సురక్ష పేరుతో ప్రభుత్వాలు శిబిరాలను నిర్వహించటం ఆపేసి, మా గ్రామాల్లో జరుగుతున్న శిశు మరణాలను అరికట్టాలని ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నాం.'' అని లక్ష్మీపేట గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.