Alluri District Police Seized 900 kg Ganja: అల్లూరి జిల్లాలో పట్టుబడిన 900కేజీల గంజాయి.. నలుగురు అరెస్టు.. ముగ్గురు పరారీ.. Alluri District Police Seized 900 kg Ganja: రాష్ట్రంలో గంజాయి సాగు, అక్రమ రవాణా పెరిగిపోతోంది. రాష్ట్రంలో ఎక్కడోచోట ఏదో ఒక ప్రాంతంలో గంజాయి పట్టుబడుతూనే ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర గంజాయికి అడ్డాగా మారింది. క్వింటాళ్ల కొద్ది గంజాయి ఇక్కడి నుంచి అక్రమంగా తరలిస్తూ ఎందరో నిందితులు పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా అల్లూరి జిల్లాలో 35 బస్తాల గంజాయి పోలీసులకు పట్టుబడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా నుంచి అల్లూరి జిల్లా మీదుగా గంజాయి అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. దీంతో ఓడిశా నుంచి జిల్లాకు వచ్చే రహదారుల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొత్తవీధి మండలం సీలేరు పోలీసులు గూడెం ధారకొండ మాయాబజార్ కూడలిలో తనిఖీలను ప్రారంభించారు.
Ganja Gang Murdered Muslim Young Man in Vijayawada: యువకుడిని హతమార్చిన గంజాయి గ్యాంగ్.. వివాదాలు వద్దన్నందుకు..!
ఒడిశా నుంచి వస్తున్న వాహనాలను పరిశీలిస్తుండగా.. పేట్రాయి మీదుగా వస్తున్న వాహనాన్నీ ఆపి తనిఖీ చేశారు. విస్తుపోయే రీతిలో.. ఆ వాహనంలో భారీగా (Police Caught Ganja) గంజాయి పట్టుబడింది. 35బస్తాల గంజాయిని పోలీసులు ఆ వాహనంలో గుర్తించారు. దీని బరువు దాదాపు 900 కేజీలు ఉంటుందని.. విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
గంజాయి తరలిస్తున్న వాహనాన్ని, పట్టుబడిన గంజాయినీ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా గంజాయి (ganja Smuggling) తరలిస్తున్న ముఠాలో నలుగుర్ని ఆరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. పట్టుబడిన వారిలో ధారకొండ (దబ్బకోట) చెందిన కర్రీ అప్పన్న, ములశలవీధికి చెందిన శెట్టి రాంబాబు, శెట్టి చిన్నబ్బాయి, చిలక మామిడి గ్రామానికి చెందిన కొర్రా నారాయణలు ఉన్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిని పట్టుకునేందుకు చర్యలు చేపడ్తున్నట్లు వివరించారు.
Sexual Harassment on Boy : గంజాయి మత్తులో.. ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి
Ganja Seized in Alluri Distrcit అల్లూరి జిల్లాలో అధికం: గతంలో కూడా ఇలాంటి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లూరి జిల్లాలో ఇలా కోట్ల రూపాయల విలువైన గంజాయి పట్టుబడటం ఇది రెండోసారి. గత నెలలో దాదాపు క్వింటాల్‌కు పైగా పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. చింతపల్లి మండలానికి చెందిన సాడిక గ్రామంలో దాదాపు 500కిలోల గంజాయి ఈ నెల మొదటి వారంలో పట్టుబడింది.
ఒడిశా రాష్ట్రంలో కొనుగోలు చేసిన గంజాయిని అల్లూరి జిల్లాలో అమ్మటానికి ప్రయత్నించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అమ్మటానికి ప్రయత్నించగా పోలీసులకు సమాచారం అందటంతో సోదాలు నిర్వహించి పట్టుకున్నారు. దాని విలువ దాదాపు కోటి వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.
Ganja Gangs: రాష్ట్రంలో మితిమీరిపోతున్న గంజాయి ముఠాల అరాచకాలు.. ఏమిలేవన్నట్లుగా అధికార యంత్రాంగం..