Tourists in Lambasingi: అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రముఖ పర్యాటక కేంద్రాలైన వంజంగి, లంబసింగిలో పర్యాటకులు సందడి నెలకొంది. ఆదివారం సెలవుదినం కావడంతో తెల్లవారు జాము నుంచి...ఈ ప్రదేశాలకు పర్యటకులు పోటెత్తారు. వంజంగి కొండపై సుర్యోదయపు వేళలో మంచు అందాలను తిలకించేందుకు.. పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వంజంగి ఘాట్ రోడ్ మొత్తం పర్యటక వాహనాలతో కిటకిటలాడింది. లంబసింగి పరిసర ప్రాంతాల్లో.. స్ట్రాబెర్రీ తోటల వద్ద స్ట్రాబెర్రీలను కొనేెందుకు పర్యాటకులు పోటీ పడ్డారు.
ఆకట్టుకుంటున్న ప్రకృతి అందాలు:మంచు కురిసే వేళలో మన్యంలో ప్రస్తుతం పొగ మంచు సోయగాలు ప్రకృతి ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆదివారం ఉదయం పదకొండు గంటల వరకు చింతపల్లిలో పొగ మంచు వీడలేదు. దీంతో వాహనచోదకులు హెడ్లైట్ల వెలుతురులోనే రాకపోకలు సాగించారు. కాగా చుట్టుపక్కల పరిసరాలు, పాడేరు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే మార్గాలు పొగమంచుతో మరింత సుందరంగా దర్శనమిచ్చాయి. ప్రధానంగా ఏజెన్సీకి వచ్చే పర్యాటకులను పొగ మంచు అందాలు ఆకర్షిస్తున్నాయి.
ప్రముఖ పర్యాటక కేంద్రం వంజంగి కొండలు కూడా పర్యాటకులతో కిటకిటలాడాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పరిసరాల అందాలు తిలకించేందుకు ఆదివారం కావడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో పరుగులు తీశారు. మేఘాల కొండ ఎక్కి ఉషోదయపు వేళలో మంచు అందాలు తిలకించారు. వంజంగి ఘాట్ రోడ్ మొత్తం పర్యటక వాహనాలతో కిటకిటలాడింది. యువకులు ఉత్సాహంతో నృత్యాలు వేస్తూ కేరింతలు కొట్టారు.
పంజా విసురుతున్న చలి:అల్లూరి జిల్లాలో చలి ప్రజలకు గజగజ వణికిస్తోంది. స్తున్నది. ఆదివారం చింతపల్లిలో 13.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఎం.సురేష్ కుమార్ తెలిపారు. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులు ప్రభావం వల్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఆయన తెలిపారు. ఉదయం వేళలో మంచు దట్టంగా కురుస్తోంది. పది గంటలు వరకూ సూర్యుడు కనిపించడం లేదు. కాగా నెలాఖరు నాటికి కనిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆంధ్రా కశ్మీర్ లంబసింగి వద్ద పర్యాటకుల సందడి ఇవీ చదవండి: