Alluri Seetharama Raju: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు శతజయంతి ఉత్సవాలను రేపు అల్లూరి జిల్లా చింతపల్లిలో నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పర్యాటకాభివృద్ది సంస్థ, రాష్ట్ర క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలు జరగనున్నాయి. చింతపల్లి పోలీస్‌స్టేషన్‌పై దాడి, రంప తిరుగుబాటుకు రేపటితో (ఆగస్టు 22) వందేళ్లు పూర్తవుతుంది. ఇందులో భాగంగా అల్లూరి దాడిచేసిన పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
చింతపల్లిలో రేపు అల్లూరి శతజయంతి ఉత్సవాలు - అల్లూరి సీతారామరాజు
Alluri Seetharama Raju రేపు అల్లూరి జిల్లా చింతపల్లిలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు శతజయంతి ఉత్సవాలను నిర్వహించనున్నారు. చింతపల్లి పోలీస్‌స్టేషన్‌పై అల్లూరి దాడి చేసి రేపటితో వందేళ్లు పూర్తి కానున్నాయి.

అల్లూరి శతజయంతి ఉత్సవాలు
అనంతరం ప్రభుత్వం డిగ్రీకళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ముఖ్య అతిథులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, కిషన్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు రోజా, పీడిక రాజన్నదొర, అమర్‌నాథ్‌లు హాజరవుతున్నారని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలిపారు.
ఇవీ చూడండి