Tribal Protests in Alluri District: తమ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని దీపావళి రోజున గిరిజనులు కాగడాలతో వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ బురిగ, చిన్న కొనెల గ్రామంలో జరిగింది.
ఎన్నాళ్లీ చీకటి కష్టాలు.. కాగడాలతో గిరిజనుల నిరసన - AP Latest News
Tribal Protests in Alluri District: తమ గ్రామాలకు విద్యుత్ వెలుగులు కల్పించాలని దీపావళి రోజున గిరిజనులు కాగడాలతో వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రపంచం కంప్యూటర్ యుగంలో పరుగులు తీస్తున్నా ఇంకా చీకట్లోనే జీవితం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
దీపావళి రోజున గిరిజనులు నిరసన
ప్రపంచం కంప్యూటర్ యుగంలో పరుగులు పెడుతున్న తరుణంలో మా గిరిజన ప్రజలమంతా ఇంకా అంధకారంలోనే మా జీవనాన్ని గడుపుతున్నామని వాపోయారు. తమ గ్రామంలో 500 మంది నివసిస్తున్నా ఇప్పటికీ విద్యుత్ వెలుగులు గాని, ఇతర ఏ సదుపాయాలు లేక చీకట్లో గడుపుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా తమ గిరి గూడేలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వన్ని వేడుకున్నారు.
ఇవీ చదవండి: