ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు: నటుడు శ్రీకాంత్

Hero Srikanth: యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా సన్మార్గంలో నడవాలని.. ప్రముఖ నటుడు శ్రీకాంత్ సూచించారు. 'దొరసాని' షూటింగ్​లో భాగంగా శ్రీకాంత్, నటి శివాని అరకులోయలో ఉన్నారు. ఖాకీలు నిర్వహించిన 'మీకోసం - మీ పోలీస్' కార్యక్రమంలో పాల్గొన్నారు. మూఢ నమ్మకాలు నశించాలంటూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. గిరిజన ప్రాంతంలో పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలు ఆదర్శప్రాయంగా ఉన్నాయని శ్రీకాంత్ కొనియాడారు.

By

Published : Feb 5, 2023, 8:58 PM IST

Srikanth
నటుడు శ్రీకాంత్

Hero Srikanth: గిరిజన యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ జీవితాలను వెలుగులమయం చేసుకోవాలని ప్రముఖ హీరో శ్రీకాంత్ అన్నారు. అదేవిధంగా గిరిజన ప్రాంతంలో మూఢ నమ్మకాల బారిన పడి అనేకమంది గిరిజనులు నిండు ప్రాణాలను బలి కొంటున్నారని మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. 'దొరసాని' షూటింగ్​లో భాగంగా శ్రీకాంత్, నటి శివాని అరకులోయలో ఉన్నారు. ఖాకీలు నిర్వహించిన 'మీకోసం - మీ పోలీస్' కార్యక్రమంలో పాల్గొన్నారు.

మీకోసం - మీ పోలీస్' కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాంత్, శివాని

రాజశేఖర్ కుమార్తె ప్రముఖ హీరోయిన్ శివాని మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో యువత చెడు మార్గాల జోలికి పోకుండా సన్మార్గంలో నడవాలని కోరారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలు ఆదర్శప్రాయంగా ఉన్నాయన్నారు. గిరిజనులతో మమేకమై వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న పోలీసుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. మత్తు పదార్థాల బారినపడి యువత జైల్లో మగ్గుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని అక్రమార్కులకు అండగా నిలిచి నిండు జీవితాలను అంధకారంలోకి నెట్టుకోవద్దని ఆయన హితవుపలికారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details