- భారాసలో చేరనున్న మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్
మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్.. భారత రాష్ట్ర సమితి పార్టీలోచేరనున్నారు. కేసీఆర్ సమక్షంలో ఆయన భారాసలో చేరనున్నారు. చంద్రశేఖర్‌తోపాటు.. మరికొందరు నేతలూ భారాస తీర్థం పుచ్చుకోనున్నారు. తోట చంద్రశేఖర్ 2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోటీ చేశారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం... కొంతకాలంగా ఆయన జనసేనకు దూరంగా ఉంటున్నారు.
- వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకపోతే.. వారెవరు పార్టీలో కనిపించరు..
ysrcp fighting for supremacy: శ్రీ సత్య సాయి జిల్లాలో వర్గపోరు కొనసాగుతుంది. వైసీపీ నాయకులు ఢీ అంటే ఢీ అంటున్నారు. కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొన్న హిందూపురం వైసీపీ నేత నవీన్ నిశ్చల్ తాజాగ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. 2024లో వైసీపీ అధికారంలోకి రాకపోతే మన పార్టీలో ఇప్పుడు ఉన్న కొందరు నేతలు కనిపించరంటూ ఆయన జోస్యం చెప్పారు.
- కొత్త ఏడాది కేరింతలు.. కాసేపట్లోనే మృత్యు ఆర్తనాదాలు.. సీసీ కెమెరాలో హత్య దృశ్యాలు
One Man Killed : నూతన సంవత్సర వేడుకల్లో అందరు కేరింతలతో సంబరాలు చేసుకుంటుంటే, ఆ ఇంట్లో మాత్రం మృత్యు ఆర్తనాదాలు ధ్వనించాయి. తూర్పుగోదావరి జిల్లా, బిక్కవోలులో ఇరుగు పొరుగుగా ఉన్న రెండు కుటుంబాల మద్య .. ఎప్పట్నుంచో వివాదాలు కొనసాగుతున్నాయి.
- ఉపాధి కోసం వెళ్లి మాల్దీవుల్లో చిక్కుకొన్న ఉత్తరాంధ్రవాసులు.. రక్షించాలంటూ వేడుకోలు
32 people stuck in Maldives: రాష్ట్రం నుంచి పలువురు ఉపాధి కోసం మాల్ధీవులకు వెళ్లి, అక్కడే చిక్కుకున్నారు. రెండు నెలలుగా అక్కడ పనిచేస్తున్న కంపెనీ వారు జీతాలు చెల్లించకపోవడంతో..ఆకలితో అలమటిస్తూ, బంధువులకు ఫోన్లు చేస్తున్నారు. తమను ఎలాగైన మాల్దీవుల నుంచి సొంత ప్రాంతానికి తరలించాలని.. బాధితులు వేడుకుంటున్నారు.
- పెద్దనోట్ల రద్దును సవాల్ చేస్తూ సుప్రీంలో 58 పిటిషన్లు.. సోమవారమే తీర్పు
కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు ఇవ్వనుంది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెలువరించనుంది.
- ప్రభుత్వం కీలక నిర్ణయం.. 'పంత్‌ను కాపాడిన డ్రైవర్, కండక్టర్‌కు సన్మానం'
క్రికెటర్ రిషభ్ పంత్‌ను కాపాడిన డ్రైవర్, కండక్టర్‌ను సత్కరిస్తామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. మరోవైపు, వీఐపీలు పంత్‌ను పరామర్శించడానికి వెళ్లొద్దని డీడీసీఏ అభ్యర్థించింది.
- ఉల్లాసంగా ఉత్సాహంగా పెంపుడు శునకాలతో యోగా
శునకాలను పెంచుకునే ఎవరైనా వాటితో కాస్త సమయం గడపాలని అనుకుంటారు. ఎంత బిజీగా ఉన్నా వాటికి మాత్రం కచ్చితంగా టైం కేటాయిస్తారు. అలా చేస్తే తెలియకుండానే వారిలో నూతనోత్సాహం దరిచేరుతుంది. పార్కుల్లోనూ నిత్యం పెంపుడు జంతువులతో నడవటం చూస్తూనే ఉంటాం. అయితే బ్రిటన్ వాసులు ఇప్పుడు పెంపుడు శునకాలతోనే యోగా చేస్తున్నారు. ఈ పప్పీయోగాతో చాలా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటున్నామని చెబుతున్నారు.
- 15 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. డిసెంబర్లో ఎంతంటే?
2022 డిసెంబర్లో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. 2021 డిసెంబర్‌తో పోలిస్తే 15 శాతం అధికంగా జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
- మెగా టోర్నీల 2023కి 'వెలకమ్'.. ఈ ఏడాదైనా టీమ్ఇండియా సత్తా చాటుతుందా?
కొత్త సంవత్సరంలోకి నూతనోత్సాహంతో అడుగుపెట్టింది టీమ్ఇండియా. 2023లో వన్డే ప్రపంచకప్‌తోపాటు టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్, ఆసియా కప్ జరగనున్నాయి. ఈ మెగా టోర్నీల్లో భారత క్రికెట్ జట్టు.. సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.
- దుమ్మురేపిన 'ఖుషి' వసూళ్లు.. రీరిలీజ్ల్లో పవన్ కల్యాణే టాప్!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'ఖుషి' రీరిలీజ్ రికార్డులు బద్దలుగొడుతోంది. సినిమా వచ్చి దాదాపు 21 ఏళ్లైనా పవర్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 'ఖుషి' రీరిలీజ్ కలెక్షన్లు ఎంతంటే?
TOP NEWS