- విజయవాడ నుంచి షార్జాకు విమాన సేవలు ప్రారంభం
Vijayawada to Sharjah Flight services started TODAY: రాష్ట్ర ప్రజలు దుబాయ్ వెేళ్లేందుకు వీలుగా విజయవాడ నుంచి నేరుగా షార్జాకు ఈరోజు నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. దీని ద్వారా షార్జా వెళ్లేవారి ప్రయాణం సుగమమైంది. ఈ విమానం వారానికి రెండు రోజులపాటు నడవనున్నాయని అధికారులు తెలిపారు.
- రేపు సుప్రీంకోర్టులో అమరావతి పాదయాత్రపై విచారణ.. తీర్పుపై ఉత్కంఠ
FARMERS ON PADAYATRA : పాదయాత్ర విషయంలో ఎలా ముందుకెళ్లాలి, ఆర్ 5 జోన్ విషయంలో ఏ తరహా పోరాటం చేయాలి, అమరావతి కేసులు సుప్రీంకోర్టులో విచారణకు రానున్న తరుణంలో మన వాదనలు ఎలా ఉండాలి.. ఇవి ఇప్పుడు రాజధాని రైతుల ఆలోచనలు.. క్షేత్రస్థాయిలో పోరాటం, అరసవెల్లి పాదయాత్రను పునః ప్రారంభించటం, కేసులపై న్యాయనిపుణులతో సంప్రదింపులు.. ఇలా మూడింటికి సమ ప్రాధాన్యత ఇచ్చేలా రైతులు పని విభజన చేసుకుని ముందుకెళ్తున్నారు. రాబోయే మూడు, నాలుగు రోజులు తమకు అత్యంత కీలకమని రాజధాని రైతులు భావిస్తున్నారు.
- ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం అమలు వాయిదా.. ఎప్పటివరకంటే?
PLASTIC FLEXI BAN IMPLEMENTATION POSTPONED : ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం అమలును ప్రభుత్వం వాయిదా వేసింది. నిషేధం అమలు ఉత్తర్వులను జనవరికి 26కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం.. నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా.. సాంకేతిక పరిజ్ఞానం, తయారీ సామగ్రిని మార్చుకునేందుకు, తగిన సమయం ఇవ్వాలంటూ ఫ్లెక్సీ తయారీదారుల విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు.
- ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు బిల్లుకు గవర్నర్ ఆమోదం
NTR Health University: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు ప్రక్రియకు గవర్నర్ ఆమోదం లభించింది. గవర్నర్ ఆమోదం లభించటంతో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు వైయస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారింది.
- 71 ఏళ్ల వయసులోను 'తగ్గేదేలే'.. డిప్లొమాలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టిన వృద్ధుడు
చదువుకు వయస్సుతో సంబంధం లేదన్నది అక్కడ అక్షరాలా నిజమైంది. కష్టించి పని చేసే వారికి రెట్టింపు ఫలితం లభిస్తుందన్నది అతడి జీవితంలో తూచా తప్పకుండా రుజువైంది. వృద్ధాప్యంలో కృష్ణా.. రామా.. అంటూ ఓ మూల కూర్చోకుండా లక్ష్యం పై దృష్టి పెట్టి అనుకున్నది సాధించి.. చదువుల తల్లిని మెప్పించి విజయలక్ష్మిని వరించాడు ఓ 71 ఏళ్ల నవ-యువకుడు.
- పాదయాత్ర చేస్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురు దుర్మరణం
పాదయాత్ర చేస్తున్న భక్తులపైకి ఓ కారు అతి వేగంతో దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం మహారాష్ట్రలోని సోలాపుర్‌లో జరిగింది.
- బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై వరుస విమర్శలు.. కారణం ఏంటో తెలుసా?
ఈజిప్టు వేదికగా త్వరలో జరగబోయే పర్యావరణ సదస్సుకు హాజరు కాకూడదని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయనపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
- తొలగించిన ఉద్యోగులకు క్షమాపణలు చెప్పిన బైజూస్ సీఈఓ.. వారికే ప్రాధాన్యం అని హామీ
ఉద్యోగుల తొలగింపుపై బైజూస్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవీంద్రన్ స్పందించారు. తొలగించిన ఉద్యోగులకు క్షమాపణ చెప్పారు.
- కోహ్లీ రూమ్ వీడియో లీక్‌పై స్పందించిన హోటల్.. ఏం చెప్పిందంటే?
ఆస్ట్రేలియాలోని హోటల్ రూమ్‌లో కోహ్లీకీ ఎదురైన చేదు అనుభవంపై సదరు హోటల్ యాజమాన్యం స్పందించింది. ఏం చెప్పిందంటే?
- అందాల ముద్దుగుమ్మల కిరాక్ పోజులు చూస్తే కళ్లు జిగేల్ మనాల్సిందే
ఎప్పటిలానే ఈ రోజు కూడా పలువురు అందాల భామలు తన హాట్ ఫొటోలతో సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. ఆ పోజులను చూసిన నెటిజన్లు వారెవ్వా ఏమున్నాయి అందాలు అంటూ ఫిదా అయిపోతున్నారు. ఓ సారి వాటిని చూసేద్దాం.
ఏపీ తాజా వార్తలు @ 7 AM