మావోయిస్టు సభ్యులు, మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్న మిలీషియా సభ్యులు సుమారు 60 మంది విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ సమక్షంలో లొంగిపోయారు. వీరిలో 33 మంది కోరుకొండ ఏరియా మావోయిస్టు సభ్యులు, 27 మంది మిలీషియా సభ్యులు ఉన్నారు. 8మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.39 లక్షల నగదు, ల్యాండ్ మైన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Maoists Surrendered : 60 మంది మావోయిస్టులు లొంగుబాటు! - Maoists surrendered news in ap
అల్లూరి జిల్లాలో మావోయిస్టు సభ్యులు, మావోయిస్టు మిలీషియా, సానుభూతిపరులు సుమారు 60 మంది విశాఖ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఎనిమిది మంది మహిళ మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.39 లక్షల నగదు, ల్యాండ్‌మైన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ తెలిపారు.

Maoists Surrendered
పెదబయలు, కోరుకొండ ఏరియా కమిటీ సెక్రెటరీ రామకృష్ణ అలియాస్ అశోక్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అశోక్ సుమారు 124 వివిధ మావోయిస్టు విధ్వంసక కార్యకలాపాల్లో పాల్గొన్నాడని వెల్లడించారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో ఆయుధ డంపులు సైతం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామని, వారిపై ఉన్న రివార్డును వారికే అందజేస్తామని ప్రకటించారు.
ఇదీ చదవండి: