Ant nests: మొబైల్ యుగంలో ఎన్నో విషయాలు కెమెరా కళ్లకు చిక్కుతున్నాయి. మారుమూల ఉండే అనేక ప్రాంతాలు విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. పల్లెటూర్లు, అడవుల్లో మాత్రమే కనిపించే అనేక ప్రాంతాలను.. పర్యటకులు ఫోన్ కెమెరాల్లో బంధించడమే కాకుండా వాటి దగ్గర సెల్ఫీలు దిగుతున్నారు. దీంతో అవి వార్తల్లో చోటు దక్కించుకుంటున్నాయి. ఈ చీమలపుట్ట ఇప్పుడు ఆ క్రెడిట్ సంపాదించుకుంది.
Ant Nest: అబ్బ ఎంత పెద్ద చీమల పుట్టో.. అయ్యింది సెల్ఫీ స్పాట్ - వంజంగి దారిలో చీమల కోట వార్తలు
Ant nests: ఆ చీమలపుట్ట ఇప్పుడో సెల్ఫీ స్పాట్ అయ్యింది. ఆ మార్గంలో వెళ్లే పర్యటకులంతా.. అక్కడకు చేరి సెల్ఫీలు దిగుతున్నారు. ఇంతకు ఆ పుట్టకు ఉన్న స్పెషాలిటీ ఎంటో తెలుసుకోవాలంటే.. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు సమీపానికి వెళ్లాల్సిందే..
![Ant Nest: అబ్బ ఎంత పెద్ద చీమల పుట్టో.. అయ్యింది సెల్ఫీ స్పాట్ 12feet ant nest at vanjangi in alluri seetharamaraju district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15537849-100-15537849-1654998825913.jpg)
వంజంగి దారిలో చీమల కోట
అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు సమీపంలో ఓ పుట్ట సుమారు 12 అడుగుల ఎత్తు పెరిగింది. ఇంత ఎత్తయిన పుట్ట అరుదు కావడంతో అటుగా వెళ్లే వారు ఆసక్తిగా తిలకిస్తున్నారు. దాని వద్ద ఫొటోలు తీసుకుంటున్నారు. అంతెత్తు పుట్ట గాలివానలకు తట్టుకొని చెక్కు చెదరకుండా ఉండటంతో చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చీమలు కట్టిన ఈ కోటను వంజంగి వెళ్లే మార్గంలో చూడొచ్చు!
ఇవీ చూడండి: