ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sports

రంగు మార్చిన రాజస్థాన్.. - రహానే

ఐపీఎల్​లో నీలం దుస్తుల్లో కనిపించే రాజస్థాన్ జట్టు ఇక నుంచి గులాబీ దుస్తుల్లో మెరవనుంది.

రంగు మార్చిన రాజస్థాన్

By

Published : Feb 11, 2019, 11:24 AM IST

'రాజస్థాన్ రాయల్స్'
..ఐపీఎల్ చూసేవారందరికి ఈ పేరు సుపరిచితమే. తాజాగా ఈ జట్టు ధరించే జెర్సీ రంగు మారింది. ఈ సీజన్ మొత్తం గులాబీ రంగు దుస్తుల్లో ఆటగాళ్లు కనిపించనున్నారు.

'మీట్ ద పింక్ డైమండ్స్..మీట్ ద న్యూ రాజస్థాన్ రాయల్స్'అంటూ తమ ట్విట్టర్​లో ఈ విషయాన్ని పంచుకుంది టీం యాజమాన్యం.

షేన్​వార్న్ సారథ్యంలో మొదటి సీజన్​లోనే కప్పును గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది రాయల్స్​ జట్టు. ఆ తర్వాతా నిలకడగా మెరుగైన ప్రదర్శనలు చేస్తూ క్రికెట్ అభిమానుల మనసు గెల్చుకుంది. యువ క్రికెటర్లతో నిండిన రాయల్స్​ జట్టు ఈ సీజన్​లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో వేచి చూడాల్సిందే.

ఆటలోనే కాక వివాదాలలోనూ ఈ జట్టు ముందుంది. యాజమానులు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ఫిక్సింగ్ ఆరోపణలతో 2016, 2017 సీజన్​లో జట్టు నిషేధం ఎదుర్కొంది.

ABOUT THE AUTHOR

...view details