ఐపీఎల్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. విశ్వరూపం ప్రదర్శించింది. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసినట్టుగా.. శివాలూగినట్టుగా ఆడిన హైదరాబాద్ ఆటగాళ్లు.. విధ్వంసం అంటే ఎలా ఉంటుందో తమ బ్యాటింగ్‌తో రుచి చూపించారు. సొంతమైదానం.. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ క్రికెట్ మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరుకు... మండుటెండలో చుక్కలు చూపించారు. ఫోర్లు, సిక్సులతో పరుగులు వర్షం కురిపించారు. కొడితే బౌండరీ, కాదంటే సిక్స్ అన్నట్టుగా ఆడిన ఓపెనర్ జానీ బెయిర్ స్టో.. 56 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సులతో.. ఏకంగా 114 పరుగులు చేశాడు. తొలి వికెట్‌కు 185 పరుగుల రికార్డు భాగస్వామ్యం జోడించిన అనంతరం... యజువేంద్ర చాహల్ బౌలింగ్ లో ఉమేష్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సగటున బంతికి 2 పరుగుల కంటే ఎక్కువ స్ట్రైక్ రేటుతో బెంగళూరు బౌలర్లను భోరున విలపించేలా చేశాడు.
సెంచరీతో చెలరేగిన వార్నర్