ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sports

భారత్ లక్ష్యం 160 పరుగులు - ind

48 బంతుల్లో 62 పరుగులు సాధించిన సోఫీ టీ 20 కెరీర్​లో ఎనిమిదో అర్ధ సెంచరీ సాధించింది.

భారత్ లక్ష్యం 160

By

Published : Feb 6, 2019, 10:31 AM IST

భారత్​, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మహిళల టీ20 మ్యాచ్​లో కివీస్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. సోఫీ అర్థ సెంచరీతో చెలరేగగా కెప్టెన్ అమీ 33 పరుగులతో కీలక ఇన్నింగ్స్​ ఆడింది. రెండో ఓవర్లోనే రాధా యాదవ్ బౌలింగ్​లో ఓపెనర్ బేట్స్ వికెట్ కోల్పోయింది కివీస్. మరో ఓపెనర్ సోఫీ డివైన్(62), వన్​డౌన్ బ్యాట్స్​ఉమెన్ కేటలిన్(15) ఇన్నింగ్స్​ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఏడో ఓవర్లో కేటలిన్ వికెట్ తీసి పూనమ్ న్యూజిలాండ్​ను దెబ్బతీసింది.

అనంతరం బ్యాటింగ్​కి వచ్చిన కెప్టెన్ అమీ సాటర్​వెయిట్​ సోఫీతో కలిసి మరో వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆడింది. వీరిద్దరి మధ్య 69 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. 48 బంతుల్లో 62 పరుగులు సాధించిన సోఫీ టీ 20 కెరీర్​లో ఎనిమిదో అర్ధ సెంచరీ సాధించింది. వెంటవెంటనే సోఫీ, అమీని ఔట్ చేసిన భారత బౌలర్లు చివరి నాలుగు ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఆఖర్లో కేటీ మార్టిన్ (27) రెండు సిక్స​ర్లు, ఓ ఫోర్​తో జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details