ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sports

పేకమేడలా కూలిన భారత టాప్​ఆర్డర్​ - న్యూజిలాండ్​

మళ్లీ నాలుగో వన్డే కథే పునరావృతమయింది. భారత్​ టాప్​ ఆర్డర్​ 18 పరుగులకే కుప్పకూలిపోయింది. విజయశంకర్​, రాయుడు పరిస్థితిని చక్కదిద్దారు.

ఐదో వన్డే

By

Published : Feb 3, 2019, 10:35 AM IST

Updated : Feb 3, 2019, 11:25 AM IST

న్యూజిలాండ్​తో జరుగుతోన్న ఐదో వన్డేలో భారత్​ టాప్​ ఆర్డర్​ మరోసారి చాపచుట్టేసింది. ఐదో ఓవర్లోనే తొలి వికెట్​గా రోహిత్​ (2) హెన్రీ బౌలింగ్​లో బౌల్డయ్యాడు. తరువాతి ఓవర్​కే శిఖర్​ ధావన్ (6)ను బౌల్ట్​ పెవిలియన్​కు పంపాడు. ఆ కాసేపటికే గిల్​ (7) వికెట్​ కోల్పోయింది భారత్. తరువాత క్రీజులోకి వచ్చిన ధోని (1)ని బౌల్ట్​ బౌల్డ్​ చేశాడు. రాయుడు (75*), విజయ శంకర్​(45) నిలకడగా ఆడుతూ నాలుగోవికెట్​కు 97 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. తరువాత విజయశంకర్ రనౌట్​గా వెనుదిరిగాడు. రాయుడు అర్థసెంచరీతో రాణించాడు. కేదార్​ జాదవ్(22*), రాయుడు క్రీజులో ఉన్నారు. భారత్ 41 ఓవర్లకి 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

ఇప్పటికే 3-1తో సిరీస్​ కైవసం చేసుకున్న భారత్​. ఐదో వన్డేలో విజయం సాధించి టీ-20 సిరీస్​కు మరింత ఉత్తేజంగా సన్నద్ధమవ్వాలని చూస్తోంది. రోహిత్​ శర్మ కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు.

ఈ మ్యాచ్​కు జట్టులో మూడు మార్పులతో భారత్​ బరిలోకి దిగింది. ధోని, మహ్మద్​ షమీ, విజయ్ శంకర్​ తిరిగి జట్టులో చేరారు.

Last Updated : Feb 3, 2019, 11:25 AM IST

ABOUT THE AUTHOR

...view details