ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sports

పదేళ్ల కల నెరవేరిన వేళ - ambati

అంబటి ఆడకపోతే నాలుగో మ్యాచ్​ ఫలితం పునరావృతం అయ్యేదే...వెంటవెంటనే వికెట్లు పడగొడుతూ కివీస్​ బౌలర్లు చెలరేగిపోతుంటే...గత మ్యాచ్​లో 92 పరుగుల చెత్త ప్రదర్శనను ఈసారీ తిరగరాసేలా కనిపించారు....వాటన్నింటినీ పటాపంచలు చేసి టీమిండియా పరువు నిలిపాడు

india

By

Published : Feb 3, 2019, 5:09 PM IST

Updated : Feb 3, 2019, 9:11 PM IST

వెల్లింగ్టన్‌ వన్డేలో కివీస్​ భారత్‌ ఘన విజయం సాధించింది. గత పదేళ్లుగా ఎందరో కివీస్​ గడ్డమీద ఆడినా సిరీస్​ తీసుకురాలేకపోయారు. తొలిసారి మన దశాబ్దకాలం నాటి కళను నెరవేర్చారు కోహ్లీ సేన. చివరి వన్డేలో 35 పరుగుల తేడాతో భారత్‌ గెలుపొంది...ఐదు వన్డేల సిరీస్​ను 4-1తో గెలిచి రికార్డు సృష్టించారు. మొదట భారత్​ 252 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో 217 పరుగులకే న్యూజిలాండ్​ ఆలౌటైంది.

ఆదుకున్న అంబటి...
వెల్లింగ్టన్​ ఐదో వన్డేలో తెలుగు క్రీడాకారుడు అంబటి రాయుడు అద్భుత ప్రదర్శన చేశాడు. 113 బంతుల్లో 90 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్​ ఆడాడు. ఒక సమయంలో 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్​ను గాడిన పెట్టాడు. అతడు ఆడకపోతే నాలుగో మ్యాచ్​ ఫలితం పునరావృతం అయ్యేదే...వెంటవెంటనే వికెట్లు పడగొడుతూ కివీస్​ బౌలర్లు చెలరేగిపోతుంటే...గత మ్యచ్​లో 92 పరుగుల చెత్త ప్రదర్శనే మళ్లీ చేస్తారన్న భయం వేసింది...వాటన్నింటినీ పటాపంచలు చేసి టీమిండియా పరువు నిలిపాడు రాయుడు. కాని శతకం సాధించడంలో విఫలమయ్యాడంటూ ఫీలయ్యారు అభిమానులు..
మరో తెలుగోడు సహాకారం ఇచ్చాడు...
ఈ మ్యచ్​లో బరిలోకి దిగిన తెలుగు క్రీడాకారుడు విజయ్ శంకర్(45) పరుగులతో రాయుడుకు అద్భుతమైన సహాకారం అందించాడు.
బౌల్ట్​ మళ్లీ బెంబేలెత్తించాడు..

న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ 4, బౌల్ట్‌ 3, నీషమ్‌ ఒక వికెట్‌ తీశారు. పిచ్​ను సరిగ్గా ఉపయోగించుకొని వేగవంతమైన బంతులేసి హడలెత్తించారు.
చాహల్​ తిప్పేశాడు..
కివీస్ పర్యటనలో తన స్పిన్ మాయజాలంతో అదరగొట్టిన చాహల్ ఈ మ్యాచ్ లో మరోసారి బంతితో సత్తా చాటాడు. క్రీజులో కుదురుకున్న న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ లాంథమ్(37) చాహల్ కు వికెట్ల ముందు దొరికిపోయాడు. తిరిగి బ్యాటింగ్ కు దిగిన గ్రాండ్ హోమ్, సంత్నార్ పరిస్థితి అంతే..చాహల్ వేసిన బంతిని భారీ షాట్ కు ప్రయత్నించిన ఇరు ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగారు.
కివీస్ తడబ్యాటు
లక్ష్య ఛేదనలో కివీస్ బ్యాట్స్​మెన్ చేతులెత్తేశారు. భారీ షాట్​కు యత్నించిన నికోలస్.. జాదవ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మున్రో(27)ను సైతం షమీ పెవిలియన్ పంపించాడు. అనంతరం బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ ఆటగాళ్లు భారీ స్కోర్లు సాధించటంలో విఫలమయ్యారు.
భారత బౌలర్లలో చాహల్ మూడు వికెట్లు ఖాతాలో వేసుకోగా, షమీ, పాండ్యాలు చెరో 2, జాదవ్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అంబటి రాయుడుకి రాగా , తొమ్మిది వికెట్లు పడగొట్టిన మహ్మద్ షమీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.

Last Updated : Feb 3, 2019, 9:11 PM IST

ABOUT THE AUTHOR

...view details