భారత్-న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్లో చివరిదైన అయిదో మ్యాచ్కు కివీస్ ఓపెనింగ్ బ్యాట్స్మన్ మార్టిన్ గుప్తిల్ దూరమయ్యే అవకాశం ఉంది.
చివరి వన్డేకు గప్తిల్ దూరం..! - న్యూజిలాండ్ క్రికెట్
ఆదివారం భారత్తో జరిగే అయిదో వన్డేకు న్యూజిలాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మన్ మార్టిన్ గప్తిల్ దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
మార్టిన్ గుప్తిల్
ఫీల్డింగ్ ప్రాక్టీస్ సమయంలో బంతిని విసిరేటపుడు గప్తిల్ గాయపడ్డాడు. వెన్నెముక కింది భాగంలో తీవ్రనొప్పితో మైదానం నుంచి నిష్ర్కమించాడు.
చివరి వన్డేలో గప్తిల్ స్థానంలో కాలిన్ మున్రోను జట్టులోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉంచింది జట్టు యాజమాన్యం. గాయం పెద్దది కాదని, టీ-ట్వంటీ సిరీస్కు గుప్తిల్ అందుబాటులో ఉంటాడని ప్రకటించింది.