ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sports

మాంచెష్టర్​లో మన వాళ్లకు షాక్.. ఆ తెల్ల కుర్రోడు ఏమన్నాడో తెలుసా..? - ప్రపంచకప్ సెమీస్

భారత్- న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతున్న మాంచెష్టర్​లో ఓ కాఫీషాప్​కు వెళ్లిన మన తెలుగువాళ్లకు అదిరిపోయే షాక్ తగిలింది. దుకాణంలోని ఆ ఇంగ్లిష్ కుర్రాడు పలకరించిన తీరుకు వాళ్లు ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఏమన్నాడో తెలుసా..!? ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్​లో బాగా తిరుగుతోంది.

ఇంగ్లండ్ యువకుడి నోట.. వెల్లువలా తేట తెలుగు మాట

By

Published : Jul 10, 2019, 4:50 PM IST

Updated : Jul 10, 2019, 5:39 PM IST

వన్డే ప్రపంచ కప్ సెమీస్ జరుగుతున్న మాంచెష్టర్ వద్ద ఓ సరదా సంఘటన జరిగింది. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానం వద్ద ఓ కాఫీషాప్​కు వెళ్లిన తెలుగువాళ్లని అచ్చతెలుగులో పలకరించాడు ఓ ఇంగ్లిష్ కుర్రాడు. ''తెలుగులో చెప్పండి.. ఇంగ్లిష్​లో కాదు'' అంటూ.. స్వచ్ఛమైన తెలుగు మాట్లాడాడు. ''తెలుగును మరిచిపోవద్దు.. మంచి భాష'' అంటూ ఆంధ్ర భాషపై మమకారాన్ని చాటుకున్నాడు. తాను రెండేళ్ల పాటు.. ఆంధ్రప్రదేశ్​లోని.. విశాఖ, విజయవాడలో ఉన్నానని చెప్పాడు. ''మీరంతా ఏ ఊరి నుంచి వచ్చారు?'' అని ఆప్యాయంగా పలకరించాడు. ఇంగ్లండ్ కు చెందిన వ్యక్తి.. అంతటి తేట తెలుగు మాట్లాడేసరికి మనవాళ్లు ఆనందంతో చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టారు.

తెలుగు మాట్లాడుతున్న ఇంగ్లండ్ వ్యక్తి
Last Updated : Jul 10, 2019, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details