ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ధోనీ స్టంపౌట్​పై ఐసీసీ హెచ్చరిక

By

Published : Feb 4, 2019, 7:25 PM IST

కివీస్​ ఆటగాడు క్రీజు దాటాడు. మహీ చూస్తూ ఊరుకుంటాడా చెప్పండి.మరి ఐసీసీ హెచ్చరిక ఎందుకు జారీ చేసింది.?

'క్రీజు దాటితే ధోనీకి కోపమొస్తుంది'

భారత్​-కివీస్​ మధ్య ఐదో వన్డేలో ధోని ఆటపై సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ మొదలైంది. మహీ అంటే వేగం అంటూ అందరూ పొగుడతుంటారు...ఈ మాజీ కెప్టెన్​ వెల్లింగ్టన్​ మ్యాచ్​లో చేసిన ఓ స్టంపౌట్​ చూస్తే ఆ మాటలు నిజమే అనిపిస్తాయి. అందుకే ఐసీసీ మిస్టర్​ కూల్​పై ట్విట్టర్లో ప్రశంసలు కురిపిస్తూనే...కొన్ని ఆసక్తికర కామెంట్లు చేసింది.

అసలేం జరిగింది:

కివీ బ్యాటింగ్​ ఇన్నింగ్స్​లో 37వ ఓవర్​...బ్యాట్స్​మెన్​ జేమ్స్​ నీషమ్​ 44పరుగులతో అజేయంగా కొనసాగుతున్నాడు. కేదార్ వేసిన బాల్​​ను స్వీప్​ షాట్​ ఆడబోయాడు ఈ కివీ ఆటగాడు...అది కాస్త మిస్సయ్యింది. కాని ప్యాడ్​లను తాకుతూ ఎడమచేతి వైపుగా కొంచెం ముందుకు వెళ్లింది. భారత ఆటగాళ్లంతా ఎల్బీ అవుట్​ కోసం అప్పీల్​ చేశారు. ఈలోపు నీషమ్​ క్రీజు దాటి పరుగుకోసం యత్నించాడు. వెంటనే బాల్​ అందుకున్న ధోనీ రెప్పపాటులో బంతిని వికెట్లకు విసిరాడు. అది కాస్త కచ్చితంగా తగిలింది. ఇంకేముంది నీషమ్​ గ్రౌండ్​ వదలక తప్పలేదు.

ఆ రనౌటే మ్యాచ్‌ను కీలక మలుపు తిప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. దీన్ని ఉద్దేశిస్తూ.. ఓ క్రీడాభిమాని చేసిన ట్వీట్‌కు ఐసీసీ స్పందిస్తూ.. ‘‘ధోనీ వికెట్ల వెనక ఉన్నప్పుడు మీరు క్రీజును వదలొద్దు’’ అంటూ ట్వీట్‌ చేసింది.

  • న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌ 4-1తో సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం తొలి మ్యాచ్‌ జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details