వన్డే సిరీస్ గెలిచి ఉత్సాహంతో టీట్వంటీలకు సిద్ధమైంది భారత మహిళా జట్టు. కానీ మొదటి మ్యాచ్‌లోనే అంచనాలు తలకిందులై ఓటమి చవిచూసింది. ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో రేపు ఆక్లాండ్‌లో జరగబోయే రెండో మ్యాచ్‌కు సిద్ధమౌతోంది.
మొదటి మ్యాచ్‌లో 160 పరుగుల ఛేదనలో 102 పరుగులకు ఒక వికెట్ నుంచి ఆలౌట్ అవడం టీం మేనేజ్మెంట్ను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ ఓటమి.. 2017 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పరాజయాన్ని గుర్తుకుతెస్తోంది.
ఈ మ్యాచ్‌లో మిథాలీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఎంతో అనుభవమున్న ఆమెకు తుది జట్టులో చోటు లభించలేదు. 2020 టీట్వంటీ ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని ఆమెను తప్పించి కొత్త వారికి అవకాశం ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండో మ్యాచ్‌లోనైనా ఆమెకు చోటు ఇస్తారా లేదా చూడాల్సిందే.
మంధానాపై అతిగా ఆధారపడటం మంచిది కాదనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఓపెనర్‌గా దీప్తి పునియా, నాలుగో స్థానంలో దయలన్ హేమలత ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయారు.
నేను 20వ ఓవర్ వరకు ఆడేందుకు ఇష్టపడతా, అదే సరైన పద్ధతి. టాప్ ఆర్డర్ 18 ఓవర్ల వరకు ఆడితే మిగతా వారిపై ఒత్తిడి తగ్గుతుంది. ఇది చేసేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తా --స్మృతి మంధానా