ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sports

భారత జైత్రయాత్రకు బ్రేకులు.. - 3rd t20 between ind nz

నిర్ణయాత్మక మూడో టీ-ట్వంటీలో గెలుపు ముంగిట భారత్ బోల్తా పడింది. ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు భారత్​పై 4 పరుగుల తేడాతో గెలుపొందింది. వరుసగా 10 టీ-20 సిరీస్​లను గెలుపొందిన భారత జైత్రయాత్రకు ఈ ఓటమితో బ్రేకు పడింది.

భారత్​

By

Published : Feb 10, 2019, 6:30 PM IST

నువ్వా నేనా అంటూ సాగిన నిర్ణయాత్మక మూడో టీ-ట్వంటీలో టీమిండియాపై కివీస్​ గెలుపొందింది. ఈ మ్యాచ్​లో గెలిచి సిరీస్​ పట్టేయాలనుకున్న భారత్​ ఆశ నెరవేరలేదు. 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మెన్ ఇన్ బ్లూ 208 పరుగులకే పరిమితమైంది. భారత బ్యాట్స్​మెన్ రాణించినా, బౌలర్లు విఫలమవడం ఓటమికి కారణమైంది.

"విజయ" దరహాసం..దక్కని విజయావకాశం..

ఈరోజు మ్యాచ్​లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసింది విజయ్ శంకర్. 28 బంతుల్లో 43 పరుగులు చేశాడు. విధ్వంసకర బ్యాటింగ్​తో ఆకట్టుకున్న విజయ్ మరి కొంత సేపు ఉండుంటే పరిస్థితి వేరేలా ఉండేది.

ఓపెనర్లలో రోహిత్ నెమ్మదిగా ఆడి 32 బంతుల్లో 38 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. 5 పరుగులే చేసిన ధావన్ మొదటి ఓవర్లలోనే వెనుదిరిగాడు.

వస్తూనే దంచుడు మొదలుపెట్టిన రిషభ్ పంత్ 12 బంతుల్లో 28 పరుగులు చేసి విజయంపై ఆశలు పెంచాడు. ఆల్​రౌండర్ హర్దిక్ పాండ్య 21 పరుగులకే పరిమితమయ్యాడు. మాజీ సారధి ధోని రెండే పరుగులు చేసి ఔటయ్యాడు.

చివర్లో ధాటిగా ఆడిన దినేశ్ కార్తీక్(16 బంతుల్లో 33 పరుగులు), కృనాల్ పాండ్య(13 బంతుల్లో 26 పరుగులు) ఓటమి అంతరాన్ని తగ్గించారే తప్ప విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయారు. చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా 11 పరుగులు మాత్రమే భారత్ సాధించగలిగింది.

భారత జాతీయ జెండా

కివీస్ ఓపెనర్స్ భళా..

టాస్ గెలిచిన భారత్ జట్టు కివీస్​కు బ్యాటింగ్ అప్పగించింది. న్యూజిలాండ్ ఓపెనర్లు సైఫర్డ్, మన్రో అదిరే ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్​కు 80 పరుగులు జోడించారు. ముఖ్యంగా మన్రో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 40 బంతుల్లో 72 పరుగులు(5 ఫోర్లు, 5 సిక్స్​లు) చేసి కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

కొలిన్ మన్రో

మరో ఓపెనర్ సైఫర్డ్ 25 పరుగుల చేసి ఫర్వాలేదనిపించాడు. ధోని చేసిన కళ్లు చెదిరే స్టంపింగ్​కు అతను పెవిలియన్ బాట పట్టాడు.
తర్వాత వచ్చిన విలియమ్సన్ 27 పరుగులు చేశాడు. ఆల్​రౌండర్ గ్రాండ్ హోం 16 బంతుల్లో 30 పరుగులు చేసి స్కోరు 200 దాటేందుకు సహాయపడ్డాడు.

భారత్ బౌలింగేనా ఇది...

గత మ్యాచ్​లో మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్న కృనాల్ పాండ్య ఈ మ్యాచ్​లో ధారాళంగా పరుగులిచ్చాడు. పాండ్య బ్రదర్స్ ఇద్దరు కలిసి వికెట్లేమి తీయకుండా 98 పరుగులు ఇచ్చేశారు. తలో వికెట్ తీసిన భువనేశ్వర్(37/1), ఖలీల్ అహ్మద్(47/1) కూడా పరుగులు కట్టడి చేయలేకపోయారు. స్పిన్నర్ కుల్​దీప్ మాత్రమే రెండు వికెట్లు తీసి 26 పరుగులు ఇచ్చాడు.

భారత్ బౌలర్లు


4 పరుగుల తేడాతో ఆతిథ్య న్యూజిలాండ్ గెలుపొంది 2-1 తేడాతో సిరీస్​ను కైవసం చేసుకుంది.
ఫిబ్రవరి 24 నుంచి స్వదేశంలో ఆస్ట్రేలియాతో రెండు టీ ట్వంటీలు, ఐదు వన్డేలు ఆడనుంది టీమిండియా.

ABOUT THE AUTHOR

...view details