ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sports

రోడ్డు ప్రమాదంలో క్రీడాకారులు దుర్మరణం - జార్ఖండ్​కు చెందిన ఇద్దరు జాతీయ స్థాయి ఆర్చరీ క్రీడాకారులు

జార్ఖండ్​కు చెందిన ఇద్దరు జాతీయ స్థాయి ఆర్చరీ క్రీడాకారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కారులో వెళ్తూ అదుపుతప్పి ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

రోడ్డు ప్రమాదంలో క్రీడాకారులు దుర్మరణం

By

Published : Feb 6, 2019, 10:55 PM IST

జార్ఖండ్​కు చెందిన ఇద్దరు జాతీయ స్థాయి ఆర్చరీ క్రీడాకారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కారులో వెళ్తూ అదుపుతప్పి ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ దుర్ఘటన మధ్యప్రదేశ్​లోని షహ్​దోల్​ జిల్లా లాల్​పురా వద్ద జరిగింది.
ఈ ఇద్దరూ జంషడ్​​పూర్​కు చెందిన జస్పాల్​ సింగ్​(19), సరస్​ సోరెన్​(21)లుగా గుర్తించారు. జాతీయ జట్టులో ఆర్చరీ ఛాంపియన్లని పోలీసులు తెలిపారు. ట్రక్కు వెనక భాగాన్ని కారు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దుర్ఘటనలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. ఇద్దరూ తీవ్రగాయలతో కొట్టుమిట్టాడుతుండగా ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు వదిలినట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రమాదంలో నుజ్జయిన కారు ముందు భాగం
  • సింగ్​, సోరెన్​ మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో జరిగే జాతీయ ఆర్చరీ ఛాంపియన్​షిప్​కు వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details