‘‘సినిమా టిక్కెట్ కొంటే పాప్‌కార్న్ ఉచితం’’ ‘‘షాపింగ్ చేస్తే రెండు టిక్కెట్లు ఫ్రీ’’
కొవిడ్‌తో థియేటర్(Cinema Theaters), మల్టీప్లెక్స్‌లకు దూరమైన ప్రేక్షకులను తిరిగి రప్పించేందుకు తెలంగాణలో ఎగ్జిబిటర్లు చేస్తున్న ప్రయత్నాలివి. ముఖ్యంగా సోమవారం నుంచి గురువారం వరకు ప్రేక్షకులు లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. శుక్రవారం కొత్త సినిమాల విడుదలతో కొంత సందడి కనిపిస్తోంది. శని, ఆదివారం వారాంతం కావడంతో ప్రేక్షకులు క్రమంగా పెరుగుతున్నారు. ఎటొచ్చి మిగతా రోజుల్లో వినోదం వైపు చూసేవారి సంఖ్య స్వల్పంగా ఉంటోంది.
అందుకే ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేందుకు ఎగ్జిబిటర్లు సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉప్పల్, అత్తాపూర్‌లో మల్టీస్క్రీన్లు కల్గిన ఒక ప్రముఖ ఎగ్జిబిటర్ టిక్కెట్ కొంటే.. పాప్‌కార్న్ ఉచితం అంటున్నారు. అది కూడా పరిమిత రోజులు, పరిమిత షోలకే ఇస్తున్నారు. గతంలో ఒక ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ, మల్టీప్లెక్స్‌తో ఒప్పందం చేసుకుని నిర్ధారించిన మొత్తం షాపింగ్ చేసినవారికి రెండు టిక్కెట్లు ఉచితంగా అందజేసింది.
ఓటీటీ యుగంలో సవాల్!
ఓటీటీ యుగంలో.. అందునా కొవిడ్ సమయంలో ప్రేక్షకులను థియేటర్(Cinema Theaters)కు రప్పించడం పెద్ద సవాల్. థియేటర్‌లో ఒక టిక్కెట్ ధరలో ఓటీటీలో ఇంటిల్లిపాది ఆస్వాదిస్తున్నారు. వీటిని అధిగమించేందుకు మల్టీప్లెక్స్‌లో పాప్‌కార్న్ ఉచితంగా ఇస్తాం అంటున్నారు ప్రదర్శకులు. మరికొందరు మరింత మంచి అనుభూతి కల్పించేందుకు స్క్రీన్లను ఆధునికీకరించారు. మరో ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ థియేటర్లలో క్రీడలు ప్రదర్శించబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
కుటుంబ సమేత ప్రేక్షకులు పెరగాల్సి ఉంది..