ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

తమిళంలో అర్జున్​రెడ్డిగా.. తెలుగు ద్వారక - ద్వారకా

విజయ దేవరకొండ కథానాయకుడిగా తెలుగులో రూపొందిన ద్వారక చిత్రం తమిళంలో... అర్జున్ రెడ్డిగా విడుదల కానుంది.

vijay devarakonda

By

Published : Feb 2, 2019, 10:44 AM IST

Updated : Feb 2, 2019, 11:27 AM IST

విజయ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ద్వారక చిత్రం తమిళ ప్రేక్షకులను అర్జున్ రెడ్డిగా పలకరించనుంది. దేశవ్యాప్తంగా అర్జున్ రెడ్డి పేరు అందరికీ సుపరిచితమైనందువల్ల ఈ చిత్రానికి అదే పేరును పెట్టినట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీజ్యోతి క్రియేషన్స్‌ బ్యానరుపై ఏఎన్‌ బాలాజీ తమిళంలో నిర్మిస్తున్నారు. పూజా జవేరి కథానాయికగా నటించింది. ప్రకాశ్‌రాజ్‌, మురళీ శర్మ, ప్రభాకర్‌ సురేఖలు ఇతర తారాగణం. సాయి కార్తిక్ సంగీతం సమకూర్చగా సినిమాటోగ్రాఫర్​గా శ్యామ్ కె.నాయుడు పనిచేశారు. శ్రీనివాస రవీంద్ర దర్శకత్వం వహించారు. యాక్షన్, కమర్షియల్, ప్రేమ వంటి ఆకట్టుకునే అంశాలతో తెలుగు ప్రేక్షకులు ఆదరణ పొందిన ఈ చిత్రాన్ని తమిళ సినీ ప్రియులకు అందించాలనే ఉద్దేశంతో అనువాదం చేశామని నిర్మాత ఏఎన్ బాలాజీ తెలిపారు. త్వరలోనే పాటలు విడుదల చేస్తామని చెప్పారు.

Last Updated : Feb 2, 2019, 11:27 AM IST

ABOUT THE AUTHOR

...view details