ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

'చిత్ర పరిశ్రమకు తీరని లోటు' - ali

కోడి రామకృష్ణ మరణంపై సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయనతో తమకున్నా అనుభవాలు పంచుకున్నారు. అప్యాయంగా పలకరించే వ్యక్తిని కోల్పోవటం బాధాకరమంటూ కన్నీటి పర్యంతమైయ్యారు.

దిగ్గజ దర్శకుడు కోడి రామకృష్ణ మరణం

By

Published : Feb 22, 2019, 9:35 PM IST

అన్ని సినిమాలు బ్లాక్ బ్ల‌స్ట‌ర్లే:అలీ

అన్ని సినిమాలు బ్లాక్ బ్లస్టర్లే :అలీ

దిగ్గజ దర్శకుడు కోడి రామకృష్ణ మరణంపై హాస్యనటుడు అలీ సంతాపం తెలిపారు .ఎంతోమంది నటీ,నటులను వెండితెరకు పరిచయం చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారన్నారు. గురువు దాసరి నారాయణరావు చూపిన బాటలోనే కష్టపడి పనిచేసిన వ్యక్తిని కోల్పోవటం బాధాకరమని అలీ విచారం వ్యక్తం చేశారు. ఈ తరం దర్శకులకుఆదర్శప్రాయుడని స్పష్టం చేశారు.

సూపర్​హిట్ సినిమాలకు చిరునామా: బి.గోపాల్

ఆయనతోనే నా సినీ ప్రయాణం: సుమన్

'తరంగిణి' సినిమాతో కోడి రామకృష్ణ తనను వెండితెరకు పరిచయం చేశారని ప్రముఖ నటుడు సుమన్ తెలిపారు. బాధను సైతం లెక్కచేయకుండా కష్టపడి పనిచేసేవారని.... తన చివరి సినిమా వరకు బాధ్యతాయుతంగా పనిచేశారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details