మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న 151వ చిత్రం 'సైరా నరసింహరెడ్డి'. ఈ చిత్రం నుంచి మరో లుక్ బయటకు వచ్చింది. ప్రముఖ నటుడు జగపతిబాబు పుట్టినరోజును పురస్కరించుకొని... ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
సైరా 'వీరారెడ్డి' తొలిరూపు వచ్చింది! - తొలిరూపు
సైరా చిత్రంలోని మరో ఆసక్తికర లుక్ బయటకు వచ్చింది. ప్రముఖ నటుడు జగపతిబాబు తొలిరూపులో ఒదిగిపోయినట్లు కనిపిస్తున్నారు. ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సైరాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
సైరా 'వీరారెడ్డి'
ఇందులో ఆయన 'వీరారెడ్డి' పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, తమన్నా పాత్రలకు సంబంధించిన తొలిరూపులు బయటకు వచ్చాయి.
చిత్రాన్ని స్వాతంత్య్ర సమరయోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 15న చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్నారు.