తెలుగు చిత్రపరిశ్రమలో గ్లామర్ రాకుమారుడు మహేశ్ బాబు. నమత్రాను వివాహం చేసుకొని నేటితో 14 ఏళ్లు గడిచాయి. ఎక్కువగా కుటుంబంతో గడుపుతూ కనిపిస్తుంటాడు ప్రిన్స్.
మీ ఇద్దరూ..అందమైన జంట: శ్రుతీహాసన్ - sruthihasan comment on maheshbabu
తెలుగు చిత్రపరిశ్రమలో గ్లామర్ రాకుమారుడు మహేశ్ బాబు. నమత్రాను వివాహం చేసుకొని నేటితో 14 ఏళ్లు గడిచాయి.

మహేశ్, నమ్రతా జంట
ప్రేమించి నమత్రా శిరోద్కర్‌ను పెళ్లి చేసుకున్న మహేశ్‌బాబు...14 సంవత్సరాల వివాహం బంధం గుర్తుగా ఓ ఫోటో ట్విట్టర్లో షేర్ చేశాడు. సోషల్ మీడియాలో మిల్కీబోయ్కు శుభాకాంక్షలంటూ అభిమానులు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.
ఆ ఫోటోపై శ్రుతీహాసన్ అభిప్రాయం తెలిపింది. 'ఫోటో బాగుంది. మీ ఇద్దరూ చక్కనైన జోడీ' అంటూ ట్వీట్ చేసిందీ అందాల భామ. తెలుగు బ్లాక్‌బస్టర్ శ్రీమంతుడు సినిమాలో మహేశ్‌తో కలిసి నటించింది శృతి.