హైదరాబాద్ సనత్‌నగర్ నియోజకవర్గంలోని పద్మారావునగర్ పార్క్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ జన్మదినం సందర్భంగా సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల మొక్కలు నాటారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని శేఖర్‌కమ్ముల అన్నారు.
కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా మొక్కలు నాటిన శేఖర్ కమ్ముల - కేసీఆర్ జన్మదిన వేడుకల్లో శేఖర్ కమ్ముల
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని హైదరాబాద్ సనత్‌నగర్‌లోని పద్మారావునగర్ పార్క్‌లో ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల మొక్కలు నాటారు. అనంతరం పార్క్ వాకర్స్ సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా మొక్కలు నాటిన శేఖర్ కమ్ముల
కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా మొక్కలు నాటిన శేఖర్ కమ్ముల
కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులతోపాటు తెరాస శ్రేణులు పాల్గొన్నాయి. అనంతరం పార్క్ ముందు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన అద్భుతంగా ఉందని.. ఆయన సేవలు తెలంగాణకు మరింత అవసరమని కొనియాడారు.