పెళ్లి తరువాత నాగచైతన్య, సమంత కలిసి నటించిన సినిమా ‘మజిలీ’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఈరోజు విడుదలైంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ చిన్న వీడియో ఆకట్టుకుంటోంది. 'నిన్ను కోరి' ఫేం శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దివ్యాంశ కౌశిక్ ఈ చిత్రంలో మరో కథానాయికగా నటిస్తోంది. ‘దేర్ ఈజ్ లవ్.. దేర్ ఈజ్ పెయిన్’ అనే క్యాప్షన్ ప్రేమకథాంశాన్ని చెబుతోంది.
'సచిన్ అవుతావో...సోంబేరి అవుతావో'
చైతూ,సామ్ మజిలీ చిత్రంలో మరోసారి కలిసి నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలైంది. చైతూ ప్రేమికుడు, భర్త, క్రికెటర్ వంటి భిన్నపాత్రల్లో కనిపించాడు.
'నీకో సంవత్సరం టైమిస్తున్నా...ఈలోగా నువ్వు సచినే అవుతావో.. సోంబేరే అవుతావో నీ ఇష్టం’ అనే డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది. చైతన్య క్రికెటర్ పాత్రలో కనిపించాడు. ‘నా ఫ్యామిలి జోలికి రావద్దు’ అంటూ సామ్ చెప్పే డైలాగ్ ఎమోషనల్ టచ్ ఇచ్చింది.
కుటుంబ కలహాలను దర్శకుడు ఆసక్తికరంగా మలిచినట్టు కనిపిస్తోంది. 'సన్‌షైన్ స్క్రీన్' బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
- విడిపోయాక ఏమయ్యింది.?
సినిమాలో చైతూ, దివ్యాంశ ప్రేమించుకుంటారు. అక్కడక్కడ ముద్దు సన్నివేశాలతో ఇద్దరి మధ్య రొమాన్స్ బాగా పండింది. కాని కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. తర్వాత నాగచైతన్యకు సమంతతో పెళ్లవుతుంది. ప్రేయసిని మరిచిపోలేక భార్య సమంతతో దూరంగా ఉంటాడు చైతూ. అందుకే ‘నువ్వు నా రూంలోకి రాగలవేమో కానీ నా జీవితంలోకి రాలేవు’ అంటూ కోపంతో నాగచైతన్య చెప్పే మాటలు ఉద్వేగాన్ని కలిగిస్తాయి.