సమంతకు సంబంధించిన వీడియోలు తొలగించాలని... రెండు యూట్యూబ్ ఛానెళ్లు, సీఎల్ రావుకు కూకట్పల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా సమంత వ్యక్తిగత వివరాలు ఎవరూ ప్రసారం చేయకూడని న్యాయస్థానం పేర్కొంది. పోస్టు చేసిన వీడియో లింకులను యూట్యూబ్ ఛానెళ్లు తొలగించాలని ఆదేశించింది. సమంత కూడా వ్యక్తిగత వివరాలు పోస్టు చేయకూడదని కోర్టు సూచించింది.
ఇదీ జరిగింది..
సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై నటి సమంత (Samantha Defamation Suit) కోర్టుకెక్కారు. హైదరాబాద్ కూకట్పల్లి కోర్టు(Kukatpally Court)లో పరువునష్టం కేసు (Samantha Defamation Suit) నమోదు చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైద్యుడు, విశ్లేషకుడు డాక్టర్ సీఎల్ వెంకట్రావుతో పాటు మరో మూడు యూట్యూబ్ ఛానెళ్లపై నటి సమంత కూకట్పల్లి కోర్టులో పరువునష్టం దావా (Samantha Defamation Suit) దాఖలు చేశారు. అక్కినేని నాగచైతన్యతో తన వైవాహిక జీవితంపై సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీ యూట్యూబ్ ఛానెళ్లలో వెంకట్రావు తప్పుడు ప్రచారం చేశారని పిటిషన్లో సమంత పేర్కొన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అబద్ధపు వ్యాఖ్యలు చేశారన్నారు.