ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

వరల్డ్​కప్ కోసం రణ్​వీర్​కు కపిల్​ శిక్షణ! - movie

"కపిల్​దేవ్ అసాధారణ వ్యక్తి... నన్ను ఎంతో ప్రభావితం చేశారు" అని కితాబిచ్చాడు రణ్​వీర్ సింగ్.

రణ్​వీర్

By

Published : Feb 7, 2019, 1:42 PM IST

1983 వరల్డ్​కప్ ఆధారంగా తెరకెక్కుతున్న '83' చిత్రం త్వరలో సెట్​పైకి వెళ్లనుంది. భారత క్రికెట్ దిగ్గజం కపిల్​దేవ్ పాత్రలో రణ్​వీర్​సింగ్ కనిపించనున్నాడు. ఇప్పటికే సినిమా కోసం కసరత్తులు ప్రారంభించాడు రణ్​వీర్. కపిల్​లా కనిపించడానికి బ్యాటింగ్, బౌలింగ్​లలో శిక్షణ తీసుకుంటున్నాడు ఈ బాజీరావ్.

"నేను కపిల్​ సార్​లా కనిపించడానికి ఆయనతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాను. ఆయన ఆలోచనలు, భావోద్వేగాలను అనుకరిస్తూ నన్ను నేను మార్చుకుంటున్నా. ఆయన పాత్ర చేయడానికి ఎంతో ఆత్రుతతో ఉన్నాను. బౌలింగ్, బ్యాటింగ్​కు సంబంధించిన చిట్కాలు నేర్చుకోవాలనుకుంటున్నా" అని చెప్పాడు రణ్​వీర్ సింగ్.

ఆనాటి క్రికెట్ జట్టులో కీలక ఆటగాడైన బల్విందర్ సింగ్ సంధు దగ్గర బౌలింగ్ చిట్కాలు తీసుకున్నాడు రణవీర్. చిత్రంలో బల్విందర్ పాత్రలో పంజాబీ గాయకుడు అమ్మి విర్క్ నటిస్తున్నాడు. 1983 క్రికెట్ జట్టు మేనేజర్ మాన్​సింగ్ పాత్రను బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి పోషిస్తున్నాడు. భజరంగీ భాయ్ జాన్ దర్శకుడు కబీర్ ఖాన్ '83' చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, మధు మంతెన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

2020 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details