ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

పూరీ చేతిలో అత్యంత ఖరీదైన కాఫీ - rapo

ప్రపంచంలో అత్యంత ఖరీదైన కాఫీ కోపి లువాక్​ను బహుమతిగా ఇచ్చిన హీరో రామ్

పూరీ జగన్నాథ్

By

Published : Feb 5, 2019, 1:22 PM IST

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా తెరకెక్కుతోంది. తన దర్శకుడికి హీరో రామ్ అత్యంత ఖరీదైన కాఫీని బహుమతిగా ఇచ్చాడు.

"మేరా ఇస్మార్ట్ శంకర్ రామ్.. ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ 'కొపి లువాక్'​ను నాకు బహుమతి ఇచ్చాడు. దీని గురించి గూగుల్​లో వెతకండి. మీకు పిచ్చెక్కుతుంది. నేను ఆ కాఫీ తాగుతున్నా"

- పూరీ జగన్నాథ్​ ట్వీట్​

ఈ కోపీ లువాక్‌ కాఫీని చెర్రీలతో తయారుచేస్తారట. దీనిని ఎక్కువగా ఇండోనేసియాలోని సుమత్రా, జావా, బాలి, సులావెసి ప్రాంతాల్లో పండిస్తుంటారు. సుమత్రా దీవుల్లో ఉండే ఆసియన్‌ పామ్‌ సివెట్ అనే జంతువు పేరు 'లువాక్‌'. ఒక్కో కప్పు కాఫీ ధర సుమారు 35 డాలర్ల నుంచి 80 డాలర్ల వరకు ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details