ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

ప్రేమకథా "చిత్రం" - రబ్​ నే బనా ది జోడీ: విద్యుత్​దీపాలతో ప్రేమ దీపం

ప్రతి వ్యక్తి జీవితం ఓ పుస్తకం అనుకుంటే ప్రేమనే పేజీ తప్పనిసరిగా తిప్పాల్సిందే...మదిలోని భావనలను ఎలా చెప్పాలా అని తహతహలాడుతుంటారు ప్రేమికులు. మరి అలాంటి వారి కోసం మన సినిమాల్లోని కొన్ని బెస్ట్​ ప్రపోజల్స్​పై ఓ లుక్కేద్దామా.!

ప్రేమికుల రోజు శుభాకాంక్షలు

By

Published : Feb 14, 2019, 9:31 AM IST

Updated : Feb 14, 2019, 10:42 AM IST

ప్రేమ.. ప్రతి వ్యక్తి జీవితం ఓ పుస్తకం అనుకుంటే ఈ పేజీ తప్పనిసరిగా తిప్పాల్సిందే... ఇందులో కొన్ని రాతలు రాయాల్సిందే... పరీక్షలో ఫెయిల్​ అయినా.. ప్రేమ పరీక్షలో పాసవ్వాలనుకుంటాడు విద్యార్థి... ఇంక్రిమెంట్లు రాకపోయినా... లవ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటాడు ఉద్యోగి... పళ్లూడి పోయినా... ప్రేమ ఫలాలను ఆరగించాలనుకుంటాడు వయోధికుడు. ఇలా ప్రతి ఒక్కరూ... మదిలోని ప్రేమను తమ ప్రేయసికి చెప్పేందుకు తహతహలాడుతుంటారు. ప్రేమికుల రోజు సందర్భంగా మన సినిమాలలో కొన్ని బెస్ట్​ ప్రపోజల్స్​ చూడండి.

  • ఆర్య: ఫీల్ మై లవ్:

నువ్వు ప్రేమించకపోతే బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపోతా... ప్రేమిస్తావా లేదా! అంటే ఏ అమ్మాయైనా రోటీన్​గా ఏం చేస్తుంది. తప్పకుండా సరే అంటుంది. ఆర్య చిత్రంలోనూ అదే జరిగింది. ఇంతలో మరో కుర్రాడు వచ్చి అదే అమ్మాయికి ఐ లవ్యూ అని చెప్పి గులాబీ ఇస్తాడు. అంతే యువత ఈలలు, గోలల నడుమ మంచి విజయాన్ని అందుకుందీ చిత్రం. అనంతరం 'నీకోసమే నిరీక్షణ' అంటూ సాగే ప్రేమ లేఖలోనూ ఫీల్ తెప్పించాడు దర్శకుడు...సినిమా అంతా ఫీల్ మై లవ్ అంటూ సాగుతూ...వన్​సైడ్​ లవ్​ ఎంతో బెటర్ అనే కోణాాన్ని దర్శకుడు చూపించాడు. 2004లో వచ్చిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, అను మెహతా జంటగా నటించారు.

  • రబ్​ నే బనా ది జోడీ: విద్యుత్​దీపాలతో ప్రేమ దీపం

ప్రేమంటే ఎప్పుడూ పెళ్లికి ముందు జరిగే అనుభవం అని అందరూ అనుకుంటారు. పెళ్లైన తర్వాత కూడా భార్యను ఎంత బాగా ప్రేమించవచ్చో ఈ చిత్రంలో చూపించారు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న అమ్మాయిని నొప్పించకుండా.. ఆమె ప్రేమను పొందటం కోసం ఆమె భర్త పడే తపనను ఈ చిత్రంలో కళ్లకు కట్టారు. తన వ్యక్తిత్వం కానీ మరో శైలికి మారి భార్యకు ప్రపోజ్ చేస్తాడు. విద్యుత్ దీపాలతో ప్రేమ వ్యక్తికరించే సన్నివేశం చిత్రానికే హైలెట్​గా నిలుస్తుంది. 2008లో వచ్చిన ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్, అనుష్క శర్మ జంటగా నటించారు. ఆ సమయంలో షారుఖ్ నటించిన ప్రతి చిత్రం ప్రేమికులను ఉర్రూతలూగించింది.
  • సూర్య సన్ ఆఫ్​ కృష్ణన్: ప్రేమ కోసం అమెరికా వెళ్లాడు

ఓ అమ్మాయికి నిన్నూ పలానా అబ్బాయి ప్రేమిస్తున్నాడు అని వేరెవరో చెబితే ఎలాగుంటుంది. ఒకరు చెబితే పర్లేదు... అమ్మాయి ఎక్కడికెళ్లినా పదే పదే అందరూ ఇలాగే చెబితే ఎవరికైనా చిర్రెత్తుకొస్తుంది. 'సూర్య సన్​ ఆఫ్ కృష్ణన్'​ చిత్రంలో సిమ్రన్ మాత్రం మౌనంగా వెళ్లిపోతుంది. అనంతరం ఆమె అతనికి తన ప్రేమను చెబుతుంది. ఇదే సినిమాలో రైలులో సమీరారెడ్డికి ప్రేమను వ్యక్తికరిస్తాడు హీరో... తొలి చూపులోనే నిన్ను చూసి పడిపోయా అంటూ గిటార్ వాయించి మరీ ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయి అతని ప్రేమను తిరస్కరిస్తుంది. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా అమెరికా వెళ్లి మరీ ఆమెను ప్రేమలో పడేస్తాడు...హీరో.
  • ఓయ్:నెలకో గిఫ్ట్

తాను ప్రేమించిన యువతి మరి కొద్దిరోజుల్లో చనిపోతుందని తెలుస్తుంది హీరోకి. అయినా ఆ బాధను గుండెలో దిగమింగుకుని ఆమె పుట్టిన రోజునాడు నెలకో బహుమతి చొప్పున ఇచ్చి ప్రేమను వ్యక్తీకరిస్తాడు. సినిమా పతాక సన్నివేశంలో ఇదే విధానంతో కథానాయిక హీరోకి ప్రపోజ్ చేస్తుంది. ఈ సీన్​కైతే ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 2009లో వచ్చిన ఈ చిత్రం మంచి ఫీల్ గుడ్ మూవీగా సినీ ప్రియులను అలరించింది.
  • ఏమాయ చేసావే: తొలిప్రేమ అంత సులభంగా పోదు

మనం ప్రేమించే అమ్మాయి... మనల్ని బ్రదర్​తో పోలిస్తే ఎలా ఉంటుంది. వెంటనే ఏమాయ చేసావే చిత్రంలో నాగచైతన్యలా ఈ ప్రపంచంలో 'ప్రతి అమ్మాయికి నేను బ్రదర్​గా ఉంటా ఒక్క నీకు తప్ప... ఎందుకంటే ఐ ఫాల్ ఇన్ లవ్ విత్​ యూ జెస్సీ' అంటూ వెంటనే ఈ డైలాగ్ చెప్పేస్తారు. అంతగా యువతను ప్రేమ మైకంలో ముంచి తేల్చింది ఈ సినిమా. 'తొలి ప్రేమ అంత సులభంగా పోదు' అంటూ సాగే డైలాగ్​తో ప్రేమికుల్లో కొత్త ఆశలు చిగురించేలా చేసింది. 2010లో వచ్చిన ఈ చిత్రంలో నాగచైతన్య, సమంత జంటగా నటించారు. అనంతరం ఆ మాయే నాగచైతన్య, సమంతను ఒక్కటి చేసింది.

ప్రేమకు... సినిమాకు అవినాభావ సంబంధం ఉంది. మనసులో ఉండే భావాల్ని తెరపై చూపించి ప్రేమికులు చేయాల్సిన పనిని సినిమా సులభం చేసింది. ప్రస్తుతం సినిమా ఏదైనా... ప్రేమ అనే అంశాన్ని తప్పనిసరిగా చేరుస్తున్నారు దర్శకులు. 95 శాతం సినిమాల్లో హీరోహీరోయిన్​ను ప్రేమించే పెళ్లాడుతున్నాడు. మరి ప్రేమికుల రోజు ఈ చిత్రాల్నీ మీ వాళ్లతో చూస్తూ ఈ ప్రపంచాన్ని మర్చిపోతారు కదూ..!
Last Updated : Feb 14, 2019, 10:42 AM IST

ABOUT THE AUTHOR

...view details