కరోనాను ఎదుర్కోవడంలో అంతా ఐక్యంగా ఉండాలని సినీ దర్శకుడు బోయపాటి శ్రీను పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ లాంటి ప్రముఖులు చెబుతున్న విలువైన సూచనలు పాటించాలని అందరినీ కోరారు. భారతీయ ఆహార అలవాట్లు, జీవన విధానాలు.. ఎలాంటి సమస్యను ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండేలా మనల్ని తయారు చేశాయని చెప్పారు. ఇంటి పట్టునే ఉంటూ.. కరోనాను వ్యాప్తి చెందించకుండా జాగ్రత్త పడదామని కోరారు.
'సామాజిక దూరాన్ని పాటించి కరోనాని అడ్డుకుందాం'
సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రతిఒక్కరూ క్రమశిక్షణతో కరోనాను సమర్ధంగా అడ్డుకుందామని సినీ దర్శకుడు బోయపాటి శ్రీను పిలుపునిచ్చారు. ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని కోరారు.
జనతా కర్ఫ్యూపై ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను స్పందన