ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

హీరో రాజ్​తరుణ్​కు తప్పిన ప్రమాదం

యువ హీరో రాజ్​తరుణ్​కు ప్రమాదం తప్పింది. చిత్రీకరణ అనంతరం ఇంటికి వెళ్తుండగా నార్సింగి వద్ద కారు అదుపు తప్పి గోడను ఢీకొట్టింది. కారును అక్కడే వదిలి రాజ్​తరుణ్ వేరే కారులో వెళ్లిపోయారు.

tarun

By

Published : Aug 20, 2019, 12:56 PM IST

హీరో రాజ్​తరుణ్​కు తప్పిన ప్రమాదం

తెలంగాణ... రంగారెడ్డి జిల్లా నార్సింగి అల్కాపురి టౌన్​షిప్​ వద్ద యువ హీరో రాజ్​తరుణ్​కు ప్రమాదం తప్పింది. సినిమా చిత్రీకరణ అనంతరం రాజ్‌తరుణ్‌ ఓ సినీ నిర్మాత కారును తీసుకుని వెళ్తుండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అల్కాపురి టౌన్​షిప్​ వద్ద అదుపుతప్పి గోడను ఢీకొట్టింది. కారును అక్కడే వదిలి రాజ్‌తరుణ్‌ వేరే కారులో వెళ్లిపోయారు. ప్రమాదానికి గురైన వోల్వో కారు నంబర్‌ టీఎస్​ 09 ఈఎక్స్​ 1100గా పోలీసులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details