బాపినీడు మృతికి చిరంజీవి సంతాపం కుటుంబ కథా చిత్రాల ప్రముఖ దర్శకుడు, పాత్రికేయుడు, కథా రచయిత విజయబాపినీడు మృతి పట్ల హీరో చిరంజీవి నివాళి అర్పించారు. తన కెరియర్ ప్రారంభంలో హిట్స్ ఇచ్చిన దర్శకుడిని చివరిసారిగా చూసి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాపినీడు 22 సినిమాలకు దర్శకత్వం వహించగా, వాటిలో 6 చిత్రాలు చిరంజీవి కావడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్లో గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్, మగధీరుడు, ఖైదీనంబర్ 786, మహానగరంలో మాయగాడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మగమహారాజు చిత్రాలున్నాయి.