'మార్కెట్లో ప్రజాస్వామ్యం' గీతాలు విడుదల - polavarm
"మార్కెట్లో ప్రజాస్వామం" చిత్రం గీతాల సీడీని విశాఖ పౌర గ్రంథాలయం లో నిర్మాత,దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి ఆవిష్కరించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిచిన నాయకులు తిరిగి ఆ సొమ్ము రాబట్టాలనుకుంటారు కానీ ప్రజాసేవ చెయ్యరని.... ఇదే కథాంశంగా చిత్రం నిర్మించినట్టు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలలో పాలకులు కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. కాళేశ్వరం ప్రారంభానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని ఆహ్వానించడం... పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి కేసులను ఉపసంహరించుకుంటామని కేసీఆర్ చెప్పడం శుభ పరిణామం అన్నారు.
'మార్కెట్లో ప్రజాస్వామ్యం' గీతాలు విడుదల