ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

ప్రేమికుల కరుణ దక్కేదెవరికో! - dev

ఫిబ్రవరి 14 ...ప్రేమికుల రోజు కానుకగా 3 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

neti cinemalu

By

Published : Feb 14, 2019, 6:34 AM IST

ఫిబ్రవరి 14...ఈరోజు చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ప్రేమికులందరూ ఈ రోజు కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ప్రేమించిన వారితో సరదాగా గడపాలనుకుంటారు. ప్రియురాలకి మంచి సినిమా చూపించాలని ప్రతి ప్రేమికుడు కోరుకుంటాడు.. అందులోనూ ప్రేమ కథా చిత్రం అయితే తిరుగుండదు. ప్రేమే కథా వస్తువుగా నేడు రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అందులో ఒకటి ప్రియా వారియర్ ‘లవర్స్ డే’ అయితే మరోటి కార్తీ, రకుల్ ప్రీత్ సంగ్ నటించిన ‘దేవ్’.
కళాశాలలో 'లవర్సే డే' :
ఒక్క కన్నుగీటుతో యావత్ దేశాన్నేఅలరించిన కేరళ భామ ప్రియా ప్రకాష్ వారియర్. ఒమర్ లలు దర్శకత్వంలో ప్రియా వారియర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లవర్సే డే, మలయాళంలో 'ఒరు ఆడార్ లవ్' . తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. వారియర్ సరసన రవూఫ్ రోషన్ నటిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమానికి స్టార్ హీరో అల్లు అర్జున్ రావడం వలన మరింత క్రేజ్ పెరిగింది.
ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా చిత్రం ఉంటుందని నిర్మాతలు తెలుపుతున్నారు. సినిమా చూసిన వాళ్లు తప్పకుండా తమ యవ్వన రోజులను గుర్తు చేసుకుంటారని దర్శకుడు ధీమాగా చెబుతున్నారు.


'దేవ్' గా కార్తీ :
ఖాకీ చిత్రం తర్వాత కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ జోడీగా నటించిన చిత్రం దేవ్. రొమాంటిక్ ఎంటర్ ట్రైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి రజాత్ రవిశంకర్ దర్శకుడు. ప్రపంచాన్ని చుట్టాలి..ఎప్పుడూ ఒకే పని చేస్తే జీవితంలో మజా ఉండదంటూ కార్తీ పలికే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. హరీష్ జైరాజ్ స్వరపరిచిన బాణీలు ఇప్పటికే మంచి ఆదరణ పొందాయి. తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకున్న ఈ హీరోకి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో వేచిచూడాల్సిందే.

వైవిధ్యంగా 'గల్లీబాయ్'

తెలుగు ప్రేక్షకులను బాలీవుడ్ చిత్రం గల్లీబాయ్ కూడా నేడే పలకరించనుంది. రన్ వీర్ సింగ్, అలియా భట్ ప్రధాన తారాగణంగా జోయా అక్తర్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. ఓ గల్లీలో పుట్టిన కుర్రాడు పాప్ స్టార్ గా ఎలా అవతరించాడో దర్శకుడు ఇందులో చూపించనున్నాడు .బెర్లిన్ చిత్రోత్సవాల్లో ఇప్పటికే సినిమా ప్రదర్శన జరిగింది. లవర్స్ మెచ్చే రొమాంటిక్ అంశాలూ ఇందులో కనిపించనున్నాయి.
మొత్తానికి ప్రేమికులు రోజున విడుదలవుతున్న ఈ మూడు చిత్రాల్లో ఎక్కువ వసూళ్లు రాబట్టి, లవర్స్ మనసులు దోచుకునే చిత్రమేదో తెలుసుకోవడానికి సాయంత్రం వరకు ఆగాల్సిందే...!


ABOUT THE AUTHOR

...view details