సినీ దర్శకుడు కోడి రామకృష్ణ అంత్యక్రియలు ఈ రోజు హైదరాబాద్ మహా ప్రస్థానంలో జరగనున్నాయి. సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. దిగ్గజ దర్శకుడి మృతిపై టాలీవుడ్ నుంచి తీవ్ర ఆవేదన వ్యక్తమైంది. కోడి రామకృష్ణతో అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. రామకృష్ణ మృతి తనను కలచివేసిందని ప్రముఖ నటి జయసుధ పేర్కొన్నారు. చలన చిత్ర చరిత్రలో తన పేజీ తానే రాసుకున్న గొప్ప వ్యక్తి కోడి రామకృష్ణ అని పరుచూరి గోపాలకృష్ణ కొనియాడారు. తనను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన మహానుభావుడు కోడి రామకృష్ణ అని ప్రముఖ నటుడు అర్జున్ గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం బాధాకరమని అన్నారు.