మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న 'సైరా' సినిమాపై ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి వారసులు దాఖలు చేసిన పిటిషన్లో అమితాబ్ బచ్చన్‌ను ప్రతివాదిగా చేర్చటంపై తెలంగాణ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. పిటిషన్లో అమితాబ్‌పై ఎలాంటి ఆరోపణలు, అంశాలు లేకపోయినప్పటికీ... ప్రతివాదిగా ఎందుకు పేర్కొన్నారని ప్రశ్నించింది. అమితాబ్ పేరును ప్రతివాదుల జాబితా నుంచి తొలగించి పిటిషన్‌ను సవరించాలని సూచించింది. సైరా సినిమాకు సెన్సార్ అనుమతి నిలిపివేయాలని కోరుతూ ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి వారసులు దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పబ్లిక్ డొమెయిన్‌లో ఉన్న అంశాలపై ఎవరికీ యాజమాన్య హక్కులు ఉండవని నిర్మాత తరఫు న్యాయవాది వాదించగా... తదుపరి విచారణ గురువారం జరగనుంది.
ఉయ్యాలవాడ కుటుంబసభ్యులకు హైకోర్టులో చుక్కెదురు - narasimha reddy family
చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాపై వివాదం కొనసాగుతోంది. చిత్రానికి సెన్సార్ అనుమతి నిలిపివేయాలని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించగా... పిటిషన్లో ప్రతివాదిగా అమితాబ్‌ను ఎందుకు పేర్కొన్నారని ధర్మాసనం ప్రశ్నించింది.
syraa