ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

'దిశ' చిత్రాన్ని ఆపాలంటూ న్యాయ కమిషన్​కు వినతి - దిశ ఎన్​కౌంటర్​ చిత్రాన్ని ఆపాలంటూ పిటిషన్

దిశ ఎన్​కౌంటర్​ కేసులో మృతుల కుటుంబాలు న్యాయ కమిషన్​ను కలిశాయి. కేసు నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రాన్ని ఆపాలంటూ విజ్ఞప్తి చేశారు. తమ వాళ్లను విలన్లుగా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

file-a-pitetion
file-a-pitetion

By

Published : Nov 2, 2020, 7:37 PM IST

'దిశ ఎన్‌కౌంటర్' చిత్రంపై దిశ నిందితుల కుటుంబ సభ్యులు న్యాయ కమిషన్​ను ఆశ్రయించారు. చిత్రీకరణ నిలిపివేయాలని నిందితులు... జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు, ఆరిఫ్ కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు. చిత్రంలో తమ వాళ్లను విలన్లుగా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విచారణలో ఉన్న అంశంపై సినిమా ఎలా తీస్తారని ప్రశ్నించారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తానని ఇటీవలే టీజర్ రిలీజ్ చేశారు. వర్మ ప్రకటించినప్పటి నుంచే దిశ కుటుంబీకులు అభ్యంతరం తెలిపారు. ఈ విషయంపై దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు.

ABOUT THE AUTHOR

...view details