ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 20, 2021, 5:38 PM IST

Updated : May 21, 2021, 8:16 AM IST

ETV Bharat / sitara

తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ బ్యాంకులు: చిరంజీవి

తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ బ్యాంకుల ఏర్పాటు: చిరంజీవి
తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ బ్యాంకుల ఏర్పాటు: చిరంజీవి

17:36 May 20

వారం రోజుల్లో అందుబాటులోకి

కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అగ్ర కథానాయకుడు చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. వెండితెరపై తనదైన నటనతో అలరించడమే కాదు, తన బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌ ద్వారా ఎందరినో ఆదుకుంటున్న చిరు ఇప్పుడు ఆక్సిజన్‌ బ్యాంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో చిరు ఆక్సిజన్‌ బ్యాంకులను త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. తాజాగా ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

‘‘సమయానికి రక్తం దొరక్క ఎవరూ మరణించకూడదనే సంకల్పంతో 1998లో చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ప్రారంభించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమయానికి ఆక్సిజన్‌ అందక ఎవరూ మరణించకూడదనే సంకల్పంతో చిరు ఆక్సిజన్‌ బ్యాంకు ప్రతి జిల్లాలోనూ నెలకొల్పాలని నిర్ణయించారు. వచ్చే వారం రోజుల్లో ప్రజలకు ఆక్సిజన్‌ బ్యాంకు అందుబాటులోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు’’ అని చిరంజీవి ఆఫీస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇదీ చదవండి:

క్యారవాన్​​ డ్రైవర్​ కుటుంబానికి మెగాస్టార్​ సాయం

Last Updated : May 21, 2021, 8:16 AM IST

ABOUT THE AUTHOR

...view details