కన్నతల్లి బాధను చూడలేక...ఆసు యంత్రాన్ని కనిపెట్టాడు ఓ చేనేత కార్మికుడు. తను చేసిన ఈ ఆవిష్కరణ ఎంతో మంది నేతన్నల జీవితాన్ని మార్చేసింది. ఆరు గంటల్లో జరిగే పని ఒక గంటకు తగ్గింది. అటువంటి గొప్ప వ్యక్తే తెలంగాణలోని సారాజిపేట మల్లేశం. అతని చరిత్ర స్ఫూర్తిగా ఓ తెలుగు చిత్రం రాబోతోంది. ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేం ప్రియదర్శి మల్లేశంగా నటిస్తున్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విడుదల చేశారు.
'సారాజిపేటలోని ఓ సాధారణ వ్యక్తి పట్టుదల ..ఎందరో చేనేతల బతుకులు మార్చింది. # సాధారణ మనిషి -అసాధారణ కథ' అంటూ ట్విట్టర్లో ఆనందాన్ని పంచుకున్నారు నటుడు ప్రియదర్శి.