క్రిష్.. నువ్వు చెప్పేది నిజమైతే నిరూపించుకో! - kangana ranauth
మణికర్ణిక... పెదవి విప్పింది. దర్శకుడు క్రిష్ చేస్తున్న ఆరోపణలపై స్పందించింది. సినిమాకు తానే దర్శకురాలినని తేల్చింది. క్రిష్ ఆరోపణలు నిజమైతే... నిరూపించుకోవచ్చని సవాల్ విసిరింది.
మణికర్ణిక... పెదవి విప్పింది. దర్శకుడు క్రిష్ చేస్తున్న ఆరోపణలపై స్పందించింది. మణికర్ణికకు నష్టం కలిగించాలనే క్రిష్ వివాదాస్పదంగా మాట్లాడుతున్నారని కంగనా ఆరోపించింది. సినిమాకు తానే దర్శకురాలినని.. ఇందులో మరో వాదనకు ఆస్కారం లేదని తేల్చి చెప్పింది. స్విట్జర్లాండ్ పర్యటన నుంచి తిరిగివచ్చిన కంగనా.. మణికర్ణిక వివాదంపై మొదటిసారి తన మనోభావాలు పంచుకుంది. క్రిష్ ఆరోపణలు నిజమైతే... నిరూపించుకోవచ్చని సవాల్ విసిరింది. తాను సొంత ప్రతిభతో 3 జాతీయ పురస్కారాలు గెలుచుకున్నానని చెప్పిన కంగనా.. అందరూ అలాగే ఎదగాలంది. అంతేకానీ అనవసర ఆరోపణలు చేసినా.. మీడియాలో మాట్లాడినా వచ్చే లాభం ఉండదని చెప్పింది. సినిమాలో పాత్రల పరిధి తగ్గించేశారని ఆరోపణలు చేసిన నటీనటులు ఈ విషయాన్ని గమనించాలని వ్యాఖ్యానించింది. ఇన్నాళ్లూ మణికర్ణిక వివాదంపై ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చిన దర్శకుడు క్రిష్.. ఇప్పుడు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.