బెర్లిన్‌లో జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాల్లో గల్లీబాయ్ చిత్రబృందం సందడి చేసింది. ఐఎఫ్ఎఫ్ఐ 2019 బ్రౌచర్‌ను హీరో రణ్వీర్ సింగ్, హీరోయిన్ అలియా భట్, దర్శకురాలు జోయా అక్తర్ కలిసి ఆవిష్కరించారు. గల్లీబాయ్ చిత్ర ప్రీమియర్ షోను ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు.
బెర్లిన్‌లో గల్లీబాయ్... - బెర్లిన్ ఫిల్మ్ ఫెస్
రణ్వీర్ కపూర్,అలియా భట్ జంటగా నటించిన గల్లీబాయ్ సినిమా బెర్లిన్ అంతర్జాతీయ సినీ ఉత్సవాల్లో ప్రదర్శించనున్నారు.
బెర్లిన్‌లో గల్లీబాయ్
ఫెస్టివల్‌లోని ఇండియన్ పెవిలియన్‌ను చిత్రబృందం సందర్శించింది. దీనిని భారత సమాచార మంత్రిత్వ శాఖ నిర్వహించింది. 75కు పైగా భారత నిర్మాణ కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 17 వరకు జరగనుంది.