బాలీవుడ్‌పై కంగన సంచలన ఆరోపణలు
హిందీ చిత్ర పరిశ్రమ నుంచి తనకు మద్దతు లభించట్లేదని బాలీవుడ్ క్వీన్ కంగనా ఆరోపించింది. బంధుప్రీతిపై ప్రశ్నించినందునే.. మంచి కలెక్షన్లు వస్తోన్నా మణికర్ణికపై ఎవరూ నోరు మెదపట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
ముంబై: మణికర్ణిక చిత్రాన్ని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన కంగనా...' బాలీవుడ్లో అందరూ ఒక్కటై నా మీద విరుచుకుపడుతున్నారు. ఇలాంటి వారితో కలిసి పనిచేయాలని లేదు. కొంత మంది చాలా ఘోరంగా ఆలోచిస్తున్నారు. నేను ఈ చిత్రం కోసం దర్శకురాలిగా పనిచేయాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోవాలి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నానో' అంటూ తీవ్రంగా విమర్శించింది.
నేను బంధుప్రీతి, వేతన,లైంగిక వివక్షపై ప్రశ్నించినందుకే ఇన్ని కష్టాలు పెడుతున్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి మంచి చిత్రం నిర్మిస్తే...ఒక్కరూ ప్రశంసించలేదు సరికదా ఒక్కరి నుంచీ మద్దతు లేదు ఎందుకంటే వారందరి బండారాలు బయటపెట్టాను కాబట్టే'నని ఆరోపించింది.
మణికర్ణిక చిత్రం విడుదలైన 12రోజుల్లోనే 84 కోట్ల కలెక్షన్లు సాధించి బాక్సాఫీసు వద్ద ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.