గాలిలోని కాలుష్యాన్ని తొలగిస్తూ... చెడుగాలిని పీల్చుకుని, దాన్ని శుభ్రపరిచి బయటికి పంపుతూ... వాతావరణంలోని తేమ శాతాన్నీ నియంత్రించేలా... ఈ ఎయిర్ ప్యూరిఫయర్ పనిచేస్తుంది. దీనిలోనే మొక్క పెంచుకునే సౌకర్యం ఉంది. గాలిలోని అలర్జీ కారకాల్లాంటి వాటిని మొక్క దగ్గర ఉండే మట్టిలోకి పంపుతూ... శుభ్రమైన గాలిని బయటికి పంపేలా దీన్ని రూపొందించారు. ఈ పరికరం మొక్క పరిస్థితినీ... మనం నీళ్లు పోయాల్సిన సమయాన్నీ మనకు యాప్ ద్వారా తెలియజేస్తుంది. పచ్చదనమూ ప్యూరిఫయర్ రెండూ ఒక చోట ఉంటే ఇంకా కావల్సిందేముంది..!
ETV Bharat / science-and-technology
గాలిని శుభ్రం చేసే కుండీ..! - గాలిని శుభ్రం చేసే పుల కుండీ న్యూస్
కింద కనిపిస్తున్నది ఏంటో చెప్పగలరా... ఏముంది పూలకుండీ అందులో మొక్కా అంటారా... అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇది అచ్చం పూల కుండీలా కనిపిస్తున్న ఓ ఎయిర్ ప్యూరిఫయర్.
గాలిని శుభ్రం చేసే కుండీ!