ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / science-and-technology

JIO: జియో సేవల్లో అంతరాయం అంటూ ట్విటర్​లో ట్రెండింగ్.. నిజమేంటి.! - రిలయన్స్ జియో నెట్‌వర్క్ సేవల్లో అంతరాయం

సాంకేతిక ప్రపంచంలో మరో 'నెట్​వర్క్ ​డౌన్​' ఘటన వెలుగులోకి వచ్చింది. జియో నెట్‌వర్క్ కనీసం రెండున్నర గంటల పాటు డౌన్ అయినట్టు తెలుస్తోంది. పలువురు వినియోగదారులు సమస్యలు ఎదుర్కొన్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

jio network down
జియో సేవల్లో అంతరాయం

By

Published : Oct 6, 2021, 2:52 PM IST

ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవల్లో కొన్ని గంటల పాటు అంతరాయం నెలకొన్న ఘటన జరిగి కొన్ని గంటలు కూడా గడవకముందే సాంకేతిక ప్రపంచంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. జియో నెట్‌వర్క్ కనీసం రెండున్నర గంటల పాటు డౌన్ అయినట్టు తెలిసింది. అనేకమంది వినియోగదారులు నో సర్వీస్ అని వస్తున్నట్టు ట్విట్టర్​లో పేర్కొనటంతో జియో నెట్​వర్క్​ డౌన్ సంబంధిత ట్యాగ్ ట్రెండింగ్​లోకి వచ్చింది.

కొంతమంది యూజర్లు జియో నెట్‌వర్క్ ఉదయం నుంచి పని చేయడం లేదని ఫిర్యాదు చేయగా, ఇంకొందరు జియో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌దీ అదే పరిస్థితి అని వివరించారు. నెట్‌వర్క్ సేవలను ట్రాక్​ చేసే డౌన్​డిటెక్టర్ పోర్టల్​ సమాచారం ప్రకారం, జియో ప్రస్తుతం నెట్‌వర్క్ సమస్యలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే వేలాది మంది జియో నెట్‌వర్క్‌పై ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్ రాష్ట్రాలు సహా ఢిల్లీ, బెంగళూరు, ఇతర కొన్ని నగరాల్లో ఈ సమస్య ఉన్నట్టు తెలుస్తోంది.

రిలయన్స్ జియో అధికారిక కస్టమర్ సపోర్ట్ హ్యాండిల్‌లో నెట్‌వర్క్ రావడం లేదని ట్విట్టర్ యూజర్లు ఫిర్యాదులతో పోటెత్తుతున్నారు. దీనిపై జియో కేర్ స్పందించింది. యూజర్లకు కలిగిన అంతరాయానికి చింతిస్తున్నామని పేర్కొంది. అయితే ఇది ఇంటర్నెట్ సేవలు, కాల్స్, ఎస్ఎంఎస్ సేవల్లో సాధారణంగా తలెత్తే సమస్యే అని వివరించింది. కేవలం ఇది తాత్కాలికమైన సమస్యని, వీలైనంత త్వరగా పరిష్కరించడానికి పని చేస్తున్నామని సంస్థ పేర్కొంది.

ఇదీ చదవండి :

AP RGUKT CET Results: ఏపీ ఆర్జీయూకేటీ సెట్‌-2021 ఫలితాలు విడుదల

ABOUT THE AUTHOR

...view details