హిమాలయన్ పింక్ సాల్ట్... :ఇది లేత గులాబీ, కాషాయం కలగలిసిన వర్ణంలో కనిపిస్తుంది. ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ రంగులో ఉంటుంది. సాధారణ ఉప్పులో ఉండే సోడియం ఇందులో తక్కువ. ఆరోగ్యరీత్యా సాల్ట్ తక్కువ తినేవారు దీన్ని ఎంచుకుంటే మేలు. సూప్‌లు, సలాడ్లలో ఈ ఉప్పును ఎక్కువగా వినియోగిస్తారు.
సెల్జిక్ సాల్ట్...లేత బూడిద రంగులో ఉండే ఈ ఉప్పు మొదట వాడకంలోకి వచ్చింది ఫ్రాన్స్‌లో. కాస్త తేమ కలిగి ఉంటుంది. సాధారణ ఉప్పుతో పోల్చితే దీనిలో ఖనిజాల గాఢత, సోడియం తక్కువే కానీ వంటకాలకు రుచిని మాత్రం పెంచుతుంది.
నల్ల ఉప్పు:ఇనుము, ఇతర ఖనిజాలు ఉండటం వల్లే దీనికా పేరు. వేడి చేస్తే లేత రంగులో కనిపిస్తుంది. ఛాట్, పానీపూరి వంటి స్నాక్స్ తయారీలో ఎక్కువగా వాడతారు.
సీ సాల్ట్:రంగు, రుచిలోనూ ఇది అచ్చం మన ఉప్పులానే ఉంటుంది. ఇందులో ఖనిజాలు ఎక్కువ. దీన్ని సాధారణంగా సాస్‌లు, మసాలాలు, గ్రేవీల్లోనూ వేస్తారు.