YCP_assembly_constituencies_Incharges_Second_List
LIVE: వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల రెండో జాబితా విడుదల - ప్రత్యక్ష ప్రసారం
<p>YCP Incharges Second List Released: వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల జాబితా కొలిక్కి వచ్చింది. రెండో జాబితా విడుదల చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లపై వారం రోజులుగా సీఎం జగన్ సుదీర్ఘ కసరత్తు చేశారు. ఎమ్మెల్యేలతో చర్చించి ఇన్‌ఛార్జ్‌లను ఖరారు చేశారు. పలువురు ఎమ్మెల్యేలను తప్పించి కొత్తవారికి అవకాశం ఇచ్చారు. రీజినల్ కో ఆర్డినేటర్లతో చర్చించి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లను సీఎం జగన్ ఖరారు చేశారు. </p><p>ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల మార్పు ఉండనుంది. అదే విధంగా ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో సైతం మార్పు ఉండనుందని, మిగతా స్థానాలపై కసరత్తు చేశాక సీఎం జగన్ మూడో జాబితా విడుదల చేయనున్నారు. సీఎం జగన్ పిలుపుతో గత కొన్ని రోజులుగా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు తరలి వచ్చారు. పార్టీ అధిష్టానం నుంచి పిలుపుతో సీఎం క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. తాజాగా రెండో జాబితాను విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమం లైవ్ మీకోసం. </p>
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 2, 2024, 9:02 PM IST
|Updated : Jan 2, 2024, 9:11 PM IST
Last Updated : Jan 2, 2024, 9:11 PM IST