TDP_Leaders_Fire_on_Kesineni_Nani_Live
LIVE: కేశినేని నానిపై టీడీపీ నేతలు ఫైర్- మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం - TDP on Kesineni Live
<p>TDP leaders Fire on Kesineni Nani Live: ఆదరించి, చేయూతనందించిన పార్టీని ఎంపీ కేశినేని నాని మోసం చేశారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. కొంతకాలంగా పార్టీ వ్యవహారాలతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న కేశినేని నాని సీఎం జగన్ కలిసి, వైఎస్సార్సీపీలో చేరాలని నిర్ణయించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కళ్లలో ఆనందం కోసమే కేశినేని నాని అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీమంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. టీడీపీలో సీటు రాదనే అభద్రతా భావంతో పార్టీ మారి చంద్రబాబు, లోకేశ్‌ని నాని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తిత్వం కేశినేని నానిదని బుద్దా వెంకన్న మండిపడ్డారు. కేశినేని నానికి వ్యతిరేకంగా మాట్లాడమని చంద్రబాబు తనకు ఎప్పుడూ చెప్పలేదని కుటుంబ సభ్యులపై బుద్దా వెంకన్న ప్రమాణం చేశారు. రాజకీయ మనుగడ కోసం చంద్రబాబుని విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం మీకోసం. </p>
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 11, 2024, 12:17 PM IST
|Updated : Jan 11, 2024, 1:29 PM IST
Last Updated : Jan 11, 2024, 1:29 PM IST